రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలని యువనేత, ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
మర్రిపాడు, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలని యువనేత, ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పొంగూరుకండ్రిక, పొంగూరు గ్రామాల్లో మంగళవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో మంచి పాలన రావాలంటే తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం పంటలు పండక రైతులు, రైతు కూలీలు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. మహా నేత వైఎస్సార్ పాలనలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాయన్నారు. దీంతో రైతులు అన్ని విధాలా అభివృద్ధి చెందారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మహానేత మరణానంతరం ఈ పథకాలు మూలనపడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు.
సంతోషంగా ఉంది:
మేకపాటి చంద్రశేఖరరెడ్డి
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గౌతమ్‌రెడ్డి పాదయాత్ర చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జనం ఉప్పెనలా వస్తూ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ నాయకులు రూప్‌కుమార్ యాదవ్, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి, అల్లారెడ్డి సతీష్, శేషం హజరత్‌బాబు, యర్రమళ్ల శివశంకర్‌రెడ్డి, మందా రామచంద్ర, చిట్టిబాబు పాల్గొన్నారు.