నగరంలోని బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో ఓ ఎన్ఆర్ఐ దారుణ హత్య కు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ డెయిరీ ఫామ్ వద్ద శుక్రవారం సదరు వ్యక్తి మృత దేహం లభ్యమవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బోయిన్ పల్లికి చెందిన గౌతం రెడ్డి కెన్యా లో ఉంటున్నాడు. ఇటీవలే నగరానికి వచ్చిన ఆయన మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.