
సాక్షి, హైదరాబాద్: విజయవాడకు చెందిన పూనూరు గౌతమ్‌రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆయనను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘గౌతమ్‌రెడ్డి తనను తాను వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడిగా పేర్కొంటూ కొద్దిరోజులుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. గౌతమ్‌రెడ్డి పార్టీ సభ్యుడు కాదు. ఆయన అభిప్రాయాలకూ పార్టీకి ఏ సంబంధమూ లేదు. ఆయనను వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడిగా పరిగణించరాదు’ అని మీడియా సంస్థలకు తెలియజేస్తున్నట్టు ప్రకటనలో విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment