సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ ఏపీ కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్‌ని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నారై డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా వాసుదేవరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి (మెల్‌బోర్న్, ఫ్లోరిడా), ఇదే విభాగానికి యూఎస్ ఎన్నారై కన్వీనర్‌గా రాజశేఖర్ కేశిరెడ్డి (బేఏరియా, కాలిఫోర్నియా)లను నియమించారు. వీరితో పాటు మరో 15 మంది ఎన్నారై డాక్టర్లను అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా, ఆయా ప్రాంతాల ఇన్‌చార్జిలుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
అద్దంకి, నరసాపురం సమన్వయకర్తల నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు శాసనసభా నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అద్దంకి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను, నరసాపురం నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును నియమించింది.