అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తొలిదశగా ఆత్మహత్యలు చేసుకున్న అగ్రిగోల్డ్ కుటుంబాలను మే నెలలో పరామర్శించనున్నట్లు చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే జూన్‌లో సీరియస్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని హెచ్చరించారు.