
నేరేడుచర్ల: రైతు రుణాలకు సంబంధించిన వడ్డీలను మాఫీ చేసే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా అసలు మాత్రమే మాఫీ చేసి వడ్డీ వసూలు చేస్తోందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అలాగే వరికి రూ. 2వేలు, పత్తికి రూ. 5వేలు, మిర్చికి రూ. 10వేల మద్దతు ధర అందిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి ఇస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment