Pressure on the government
-
వడ్డీ మాఫీ చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి
నేరేడుచర్ల: రైతు రుణాలకు సంబంధించిన వడ్డీలను మాఫీ చేసే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా అసలు మాత్రమే మాఫీ చేసి వడ్డీ వసూలు చేస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అలాగే వరికి రూ. 2వేలు, పత్తికి రూ. 5వేలు, మిర్చికి రూ. 10వేల మద్దతు ధర అందిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి ఇస్తామని వివరించారు. -
‘నల్లధనం కాదని హామీ పత్రాలివ్వండి’
న్యూఢిల్లీ: ఓ పక్క ప్రభుత్వ ఒత్తిడి, మరోపక్క చెడ్డపేరు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న స్విట్జర్లాండ్ బ్యాంకులు దానికి తగ్గ చర్యలు చేపట్టాయి. తమ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము.. పన్ను ఎగవేతకు సంబంధించినది కాదంటూ తాజాగా హామీ పత్రాలు ఇవ్వాలని భారత ఖాతాదారులను కోరాయి. ఆడిటర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని వ్యక్తిగత, కార్పొరేట్ ఖాతాదారులను కోరుతున్నాయి. విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించే చర్యలను భారత్ వేగవంతం చేయడం, దానికి స్విస్ ప్రభుత్వం సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో బ్యాంకులు ఈ చర్యకు ఉపక్రమించాయి. కాగా, నల్లధన ఖాతాలను ఎందుకు వెల్లడించడంలేదో చెప్పాలంటూ హెచ్ఎస్బీసీకి భారత అధికారులు షోకాజ్ నోటీస్ కూడా పంపినట్లు సమాచారం. -
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి
నిరుద్యోగులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఐక్యవేదిక విజ్ఞప్తిపై స్పందన హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధి లగుడు గోవిందరావుతోపాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయం లో జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ర్టంలో ఏపీపీఏస్సీ గ్రూప్-1,2,4, జేఎల్, డీఎల్, ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్వో, పంచాయతీ, అటవీశాఖలోని పోస్టులన్నీ కలపి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అన్న వాగ్దానాన్నీ కూడా నెరవేర్చేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఖాళీలు భర్తీ అయ్యేలా కృషి చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. కాగా, ఉద్యోగాల నియామకాల్లో ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే సంకల్ప దీక్షకు మద్దతివ్వాలని కూడా వారు జగన్‌ను కోరారు. జగన్‌ను కలసిన వారిలో కె.మహేష్, పి.శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు తదితరులు ఉన్నారు.