హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతులకు రుణమాఫీ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. రైతు సాధికారత కార్పొరేషన్ (ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం తొలుత ఐదు నుంచి 7 వేల కోట్లను మూలధనంగా ఉంచుతుంది.
బ్యాంకుల నుంచి గతంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు ఒక్కొక్కటి రూ.25 వేల ముఖవిలువ గల బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ బాండ్లను రైతులు అవసరమైతే కార్పొరేషన్‌కు అప్పగించి నగదు తీసుకోవచ్చు. కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం సమకూర్చే మూలధనాన్ని రైతులు చెల్లించాల్సిన రుణాల స్థానంలో బ్యాంకులకు చెల్లిస్తారు. కాగా ఆ బాండ్లు కాలపరిమితి తీరిన తర్వాత వాటిపై ప్రభుత్వం రైతులకు పది శాతం వడ్డీ చెల్లించనుంది.
15 నుంచి రుణమాఫీ సర్టిఫికెట్ల జారీ
Published Tue, Sep 30 2014 12:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement