హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామన్ని హామీ ఇవ్వటంతో రైతులు ఎవరూ రుణాలు కట్టడానికి ఇష్టపడటం లేదని బ్యాంకర్లు పేర్కొన్నారు. అందువల్లే ఖరీఫ్ లో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని బ్యాంకర్లు తెలిపారు. 186వ రాష్ట్రా స్థాయి బ్యాంకర్ల సమావేశం మంగళవారమిక్కడ జరిగింది.
ఈ సమావేశంలో బ్యాంకర్లు మాట్లాడుతూ పావలా వడ్డీపై ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావలని, లేదంటే వడ్డీ రైతులపై పడే అవకాశం ఉందని బ్యాంకర్లు అన్నారు. ప్రభుత్వం రుణ ఖాతాదారుల వివరాలు కోరిందని, అక్టోబర్ 10కల్లా నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ కవరేజీలను మరొక నెల పొడిగించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.