రుణమాఫీ చేసి సన్మానం చేయించుకో | ysrcp mla gadikota fire on chandra babu | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేసి సన్మానం చేయించుకో

Published Wed, Oct 22 2014 1:42 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

రుణమాఫీ చేసి సన్మానం చేయించుకో - Sakshi

రుణమాఫీ చేసి సన్మానం చేయించుకో

ఏపీ సీఎం చంద్రబాబుకు గడికోట డిమాండ్
 

హైదరాబాద్: రైతుల, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ అణా పైసలతో సహా మాఫీ చే సి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేయించుకోవాలని ఆ పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా రుణాల  మాఫీ కోసం రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేయడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘రైతుల రుణాలు మాఫీ అయిపోతున్నట్లు ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ ముఖ్యమంత్రి సన్మానాలు కూడా చేయించుకుంటున్నారు. ఇలా ప్రజలను మభ్య పెట్టే బదులు షరతులేమీ లేకుండా రుణాలన్నింటినీ మాఫీ చేసి మాతోనే చంద్రబాబు సన్మానం చేయించుకోవాలి’’ అని సూచించారు.

డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికి ఇపుడు వారికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. నరకాసురుడితో యుద్ధం చేస్తూ శ్రీకృష్ణుడు మూర్ఛపోతే ఆయన సతీమణి సత్యభామ ఒక స్త్రీశక్తిగా లేచి నిలబడి ఆ రాక్షసుడిని వధించిందని, ఇక్కడ కూడా చంద్రబాబు చేతిలో మోసపోయిన డ్వాక్రా మహిళలు ఒక శక్తిగా లేచి  గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement