పాలకొండ: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వమే మహిళా స్వయంశక్తి సంఘాల ఏర్పాటును ప్రోత్సహించింది. ఇప్పుడే అదే ప్రభుత్వం ఈ సంఘాలు ఆర్థికంగా దివాలా తీసేలా చేస్తోంది. ఎన్నికల ముందు రైతుల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామ ని హామీ ఇచ్చిన తెలుగుదే శం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయిం చిం ది. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశ తో నెలవారీ వాయిదాలు చెల్లించని మహిళా సంఘాల పై ఇప్పుడు బ్యాం కులు ప్రతాపం చూపుతున్నాయి. రుణ వాయిదాలు చెల్లించని సంఘాల కు 14 శాతం వడ్డీతో సహా రికవరీకి నోటీసులు జారీ చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా సంఘాల పొదుపు ఖాతాల నుంచి సొమ్మును అప్పుల ఖాతాకు జమ చేస్తున్నాయి. ఈ విధంగా ఇప్పటికే జిల్లా లో రూ.4 కోట్ల వరకు బ్యాంకులు జమ చేసుకున్నాయి.
సంక్షోభంలో సంఘాలు
గత ఏడాది డిసెంబర్ వరకు డ్వాక్రా సంఘాలు సక్రమంగా నడిచేవి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాం తాల్లో 36583, మున్సిపాలిటీల్లో 5319.. మొత్తం 41902 సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘాలు ప్రభుత్వం నుంచి రూ.54,498.16 కోట్ల రుణాలు పొందాయి. కాగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అప్పటి నుంచి మహిళా సంఘాలు ప్రతి నెలా చెల్లించాల్సిన రుణ వాయిదాలను కట్టడం నిలిపివేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీప ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు సంఘాలు బకాయి పడిన సొమ్ముకు నెలకు 14 శాతం చొప్పున వడ్డీ విధించాయి. అసలు, వడ్డీ చెల్లించడం పెనుభారంగా మారడంతో మహిళా సంఘాలు దిగాలు పడ్డాయి. ఈ విధంగా జిల్లాలో ఇప్పటి వరకు మహిళా సంఘాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3425 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనికి ప్రతి నెలా వడ్డీ కలుస్తుండటంతో మొత్తం బకాయిలు రూ.5794 కోట్లకు పెరిగాయి. వీటిని త్వరగా చెల్లించాలని బ్యాంకుల నుంచి మహిళా సంఘాలప ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
రూ. 4 కోట్ల పొదుపు సొమ్ము బదిలీ
వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు స్త్రీ నిధి కింద మహిళా సంఘాలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును అప్పుల ఖాతాకు జమ చేసుకున్నాయి. ఆ ఖాతాలు ఖాళీ కావడంతో మిగిలిన అప్పుల రికవరీ కోసం ప్రస్తుతం ఐకేపీ ద్వారా సంఘాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 758 సంఘాలకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. తక్షణమే అప్పులు చెల్లించకపోతే వడ్డీతోసహా బలవంతంగానైనా వసూలు చేస్తామని ప్రత్యేకంగా రుణ వసూళ్ల కోసం ఏర్పాటు చేసిన బృందాలు మహిళా సంఘాలను హెచ్చరిస్తున్నాయి.
లక్ష్యానికి దూరంగా...
ఈ పరిణామాలతో జిల్లాలో ప్రస్తుతం మహిళా సంఘాలకు రుణాల చెల్లింపు లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది రూ. 356 కోట్ల రుణాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత వరకు రూ.130 కోట్లు మాత్రమే చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా సంఘాలు అప్పులు చెల్లించకపోవడంతో రుణాలు మంజూరు కాలేదు. ఇప్పటికే 120 సంఘాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి బ్యాంకు రుణాలు తీర్చి, తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీరికి మాత్రమే బ్యాంకర్లు కొత్త రుణాలు అందజేశారు. పాలకొండ మండలంలో 27 సంఘాలు ఉండగా.. వీటన్నింటిపైనా రుణ బకాయిలు చెల్లించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు ఆ సంఘాల సభ్యులు చెబుతున్నారు. కాగా బ్యాంకర్లు ఇప్పటికే 7300 సంఘాలను నాన్‌పేమెంట్ జాబితాలో చేర్చారు. ఈ సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ వస్తోందని అధికారులు చెబుతున్నారు.
డ్వాక్రాకు టోకరా
Published Mon, Dec 8 2014 2:54 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement