డిచ్‌పల్లి : టీఆర్‌ఎస్ సర్కార్ ప్రకటించిన పంట రుణమా ఫీ పథకం అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రు ణమాఫీ పథకం వర్తింప జేయడంలో ఆధార్ నెంబరు తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయి తే ఈ విషయంలో కొందరు అధికారులు ఒకరకంగా, మరికొందరు అధికారులు మరోరకంగా చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆ ధార్ అనుసంధానంతో తమకు లాభం జరుగుతుం దా, లేక నష్టం జరుగుతుందా అనే విషయమై రైతులు మదనపడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళంగా మారింది.
బ్యాంకుల్లో రైతుల బారులు..
పంట రుణాలు పొందిన రైతు కుటుంబంలో *లక్ష వర కు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం రైతులు తప్పనిసరిగా ఆధార్ జిరా క్స్ పత్రాలను బ్యాంకులు, సహకార సంఘాల్లో అందజేయాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు బ్యాంకులు, సింగిల్ విండోల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు తాత, తం డ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూముల్లో పంటలు సాగుచేస్తున్నారు. రుణాలు సైతం వారి పేర్లమీదే పొందారు. ఇప్పుడు రుణం పొందిన వారి ఆధా ర్ కార్డు సమర్పించాలని అధికారులు అడగటంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
గడువుపై స్పష్టత లేదు..
ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ అర్హత పొందేందుకు రైతులు బ్యాంకు పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇవ్వాలని బ్యాంకర్లు కోరుతున్నా రు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయాధికారులు సైతం రైతులకు సమాచారం అందజేస్తున్నారు. అయితే అధా ర్ కార్డు జిరాక్స్‌లను ఎప్పటిలోగా అందజేయాలనే దానిపై గడువు స్పష్టంగా చెప్పడం లేదు.
కానీ మండల స్థాయి అధికారులు తమ మండలాల్లో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, ఈనెల 30లోగా రుణమాఫీ అర్హత గల రైతుల జాబితాను అందజేయాలని సూచి స్తున్నారు. బ్యాంక ర్లు ఇచ్చిన జాబితాను కలెక్టర్‌కు అందజేస్తామని మండల అధికారులు తెలుపుతున్నా రు. ఈనెల 28, 29 తేదిల్లో గ్రామసభలు నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆధార్ పొందని రైతులు నమోదు కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.నెలాఖరులోగా ఆధార్‌కార్డు సహా అన్ని పత్రాలు అందించకుంటే రుణమాఫీ వర్తించదేమోనన్న ఆందోళన వారిలో ఉంది. అధార్ కార్డులో పేరు తప్పుగా వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామసభల్లో నిర్ధారిస్తాం..
రుణమాఫీకి ఆధార్‌కార్డు ఇవ్వని వారిని పరిగణలోకి తీ సుకుంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులను ఆధార్ జిరాక్స్‌లు తప్పనిసరిగా కావాలని అడగటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీకి అర్హత గల రైతుల పేర్లను రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సరిపోల్చుకుని గ్రామసభల్లో నిర్ధారిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా రైతుల్లో ఆందోళన తొలగడం లేదు.
ఆధార్‌పై రైతుల్లో ఆందోళన
Published Fri, Aug 29 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement