సాక్షి, నిజామాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే ఆ బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నకుమారుడినే కడతేర్చి కర్కశంగా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదివారం డిచ్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డిచ్‌పల్లి మండలం ధర్మారానికి చెందిన పద్మ అనే మహిళకు ఎనిమిది సంవత్సరాల బాబు రాజేష్(8) ఉన్నాడు. గత కొంతకాలంగా వారి కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో కలత చెందిన పద్మ అన్నెం పున్నెం ఎరుగని కొడుకును ఉరివేసి చంపింది. ఈ ఘటన పలువురి మనసులను కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment