TRS Sarkar
-
అసెంబ్లీ బోనులో సర్కారును నిలబెట్టాలి
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఫల్యాలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ బోనులో నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఏడాది 15 రోజులు కూడా అసెంబ్లీ జరగనందున, ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఇరవై రోజులకు తగ్గకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేఎల్పీ సమావేశానంతరం అసెంబ్లీ కమిటీ హాలులో పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 15న బీఏసీ సమావేశం జరగనున్న నేపథ్యంతో ఆ భేటీ తర్వాత మళ్లీ సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేస్తామని చెప్పా రు. టీఆర్ఎస్ సర్కార్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. -
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
టీఆర్ఎస్ సర్కార్‌కు తమ్మినేని ప్రశ్న కోడేరు: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఏ ప్రభుత్వానికీ పుట్టగతులు ఉండవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పుల, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, సింగాయిపల్లి, కోడేరు మీదుగా కొనసాగింది. కోడేరులో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గిరిజను లు, దళితులకు మూడెకరాల భూమినిస్తామని, రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే మార్గంలో పయనించాలన్నారు. కరువు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలి సాక్షి, హైదరాబాద్: కరువు ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే నివారణ, సహాయ చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. రైతాంగం అంతా సంతోషంగా ఉందని హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలు చేయడం ఆపేసి, వెంటనే ఖరీఫ్ సీజన్లో ఎండిపోయిన పంటల పరిశీలనకు అధికారులకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని సూచించిం ది. నష్టపోయిన పంట అంచనాలను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రబీ సాగు కోసం విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలన్నారు. -
టీఆర్ఎస్కు సెప్టెంబర్ 17 టెన్షన్
-
రుణమాఫీ ఎందుకు చేయరు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పుష్కలంగా నిధులుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణమాఫీ ఎందుకు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, విత్తనాల కొ రత, ఎరువుల కొరత, రుణాలు దొర క్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇద్దరు రైతులు బలవన్మరణం యాలాల: అప్పులబాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కేపల్లివాసి కె.ఆశప్ప(32), కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం పోచెట్టిపల్లివాసి జి.తిరుపతి(45) ఆత్మహత్య చేసుకు న్నారు. -
'అటెండర్ ఉద్యోగం కూడా భర్తీచేయకపోవడం సిగ్గుచేటు'
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఏడాది పాలనలో కనీసం అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఆదివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యువకులు, విద్యార్థులే కీలకపాత్ర పోషించారన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఉత్తిమాటగా మారిందని విమర్శించారు. తెలంగాణలోని 11విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లు లేకుండా పోయారన్నారు. హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. -
కొత్త పరిశ్రమలు వచ్చేనా?
జిన్నారం: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కొత్త విధానాలు రూపొందించడంతో జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తామంటూ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుపై సింగిల్ విండో పథకాన్ని చూపొందించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ పథకంతో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలసీపై పారిశ్రామిక వేత్తల నుంచి కొంత సానుకూలత, వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రోత్సాహాలన్నీ కొత్తగా పరిశ్రమలు స్థాపించబోయే వారికేనా అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను కాపాడేందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 5 వేల ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి పనులను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో విధానాన్ని వర్తింపజేయటం పట్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఈ పథకంపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపేందుకు ప్రభుత్వం నుంచి వత్తిడిలు వస్తున్నాయని, అదే జరిగితే తమకు ఎలాంటి సాయం అందిస్తారో సర్కార్ తన నూతన పాలసీలో తెలపలేదని పలువురు పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి మాత్రమే ప్రోత్సహాకాలను అందిస్తే, తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా, నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుందో లేదోననే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగింల్ విండో పాలసీ బాగున్నప్పటికీ ఇది కేవలం నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకేనా ? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అనుమతులు కావాలంటే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదని, పరిశ్రమలను కేటగిరీలుగా విభజించే విషయంపై కూడా స్పష్టత లేదనినే అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫార్మా, స్టీల్, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కేటగిరీల వారిగా విభజించే విషయంపై ప్రభుత్వం తగిన స్పష్టతను ఇవాల్సి ఉందని యాజమన్యాలు చెబుతున్నాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ కేటగిరీలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదిఏమైనా సర్కార్ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలకు పలు అనుమానాలున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
రోడ్లు తళతళ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గతుకుల రోడ్లకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలోని గ్రామీణ రోడ్లతోపాటు ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా విలేకరులతో టెలీమీట్‌లో మాట్లాడారు. జిల్లాలో 2009 ముందు గ్రామీణ ప్రాంతాలకు వేసిన బీటీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు. ఇందుకోసం కిలోమీటరు రోడ్డు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నామని, మొత్తం 1,528 కిలోమీటర్ల రోడ్లు పనుల కోసం రూ.209 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. బ్రిడ్జిలు, కాజ్‌వేల పనుల కోసం మరో రూ.40 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని తెలిపారు. దీంతో పాటు జిల్లాలో సుమారు 500 కిలో మీటర్ల మేరకు ఇప్పటివ రకు ఉన్న మట్టి, కంకర రోడ్లను తొలగించి పూర్తి స్థాయి బీటీ రోడ్డు వేస్తామని మంత్రి తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు వివరించారు. బీటీ రోడ్డు నిర్మాణం కోసం కిలోమీటరుకు రూ.49 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. గతంలో ఇది రూ.39 లక్షలు ఉండగా, పనుల నాణ్యత, నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు ఎక్కువగా ఇచ్చిందన్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాల వరకు రోడ్డు చెడిపోకుండా కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత కాలంలోపు రోడ్లు గుంతలు పడితే కాంట్రాక్టరే మరమ్మతు చేయించే విధంగా నిబంధనలు రూపొందించినట్లు హరీష్‌రావు తెలిపారు. తండాల్లోనూ రోడ్లు ఇప్పటి వరకు పిల్లబాటలు కూడా లేని తండాలు, మదిర గ్రామాలకు మట్టి రోడ్లు వేస్తామని హరీష్‌రావు తెలిపారు. ప్రభుత్వం రహదారుల నిర్మాణ పనుల్లో తండాలు, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మేర ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కోసం మరో రూ.40 కోట్లు అదనంగా నిధులు వెచ్చించనుందన్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీటీ రోడ్ల రెన్యూవల్ కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ.27 కోట్లు, సిద్దిపేటకు రూ.13 కోట్లు, మెదక్‌కు రూ.20 కోట్లు, దుబ్బాకకు రూ.17 కోట్లు, సంగారెడ్డికి రూ.16 కోట్లు, పటాన్‌చెరుకు రూ.10 కోట్లు, నర్సాపూర్‌కు రూ.32 కోట్లు, జహీరాబాద్‌కు రూ. 32 కోట్లు, నారాయణఖేడ్‌కు రూ.25 కోట్లు, అందోలు నియోజకవర్గానికి రూ.20 కోట్లు చొప్పున నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. డిసెంబర్లోనే టెండర్లు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. గతంలో తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించమని ఎన్నిసార్లు అడిగినా... అప్పటి ప్రభుత్వాలు రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపాయని గతాన్ని గుర్తు చేశారు. ఆ బాధ తమకు తెలుసుకాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించారని చెప్పారు. బీటీ రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించి డిసెంబర్ నెలలో టెండర్లు పిలుస్తామని, మే నెలాఖరు నాటికి దాదాపు 80 శాతం రోడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఇవేకాకుండా ఆర్అండ్బీ శాఖ కింద రోడ్ల విస్తరణ కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వివరించారు. -
మళ్లీ పల్లెబాట
సొంత ఊళ్లకు పయనమైన వలసజీవులు * సంక్షేమ ఫలాలు పొందేందుకు పరుగులు * ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు * వ్యయభారమైనా తప్పని పరిస్థితి మెదక్: ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస జీవులంతా ఇపుడు స్వగ్రామాల బాట పడుతున్నారు. ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే కోసం పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిన శ్రమ జీవులు...ఇపుడు మరోసారి పల్లెముఖం పట్టాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. పూట గడవక పొట్టకూటికోసం పట్నం వెళ్లిన వారంతా తమ పనులు మానుకొని ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ సర్కార్ ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించింది. సర్వేకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన పల్లెవాసులు ఆగమేఘాల మీద తమ పనులు మానుకొని స్వగ్రామాలకు పరుగులు పెట్టారు. దీంతో దాదాపు తెలంగాణ రాష్ర్ట జనజీవనం స్తంభించింది. పథకాల కోసం పల్లెలకు అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించడానికి టీఆర్ఎస్ సర్కార్ మరోసారి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అర్హులకు పథకాలు అందించి, అనర్హులపై వేటు వేసేందుకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారం చేసుకుంది. గతంలో ఉన్న రేషన్‌కార్డులను, పింఛన్ పథకాలను రద్దు చేస్తూ సమగ్ర సర్వే ప్రాతిపదికగా ఈనెల 15లోగా అర్హులైన లబ్ధిదారులంతా దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో కూలీనాలీ చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దరఖాస్తుల గడువు కేవలం ఐదు రోజులు మాత్రమే విధించారు. ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు ముగిసిపోయాయి. దీంతో మరో మూడు రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తమ కుటుంబీకుల ద్వారా విషయం తెలుసుకున్న వలస జీవులు స్వగ్రామాలకు వెళ్లేందుకు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరా గ్రామాలకు వచ్చాక ఆధార్‌కార్డులు లేక కొంతమంది, ఇతర ధ్రువ పత్రాలు లేక మరికొంతమంది పరేషాన్ అవుతున్నారు. ఈ క్రమంలో కేవలం రూ.1 విలువ చేసే దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ సెంటర్ల వారు రూ.5 విక్రయిస్తుండగా, ఆధార్ నమోదు కోసం మీ సేవా కేంద్రాలు రూ.100 పైగా దండుకుంటున్నాయి. దరఖాస్తు తర్వాత ఊర్లోనే ఉండాలి పింఛన్లు, ఆహార భద్రత కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 15 రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులో తెలిపిన వివరాలను నిర్ధారణ చేసుకునేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు మండల అధికారులు ఇంటింటి సర్వే నిర్విహ ంచనున్నారు. దీంతో అధికారులు ఎవరింటికి ఎప్పుడు వస్తారో తెలియక వలసజీవులంతా 15 రోజులపాటు ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకునే శ్రామిక జీవులు ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు వికలాంగులు కూడా పింఛన్ల కోసం మెడికల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. అలాగే ఆధార్‌కార్డు లేనివారు కనీస ఎన్రోల్మెంట్నంబర్ను రాయాల్సి ఉం టుంది. ఇవన్నీ ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న వలసజీవులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో జీతాలు రాక పూట గడవని పరిస్థితి నెలకొంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా వారికి ఆహార భద్రత కార్డులు, పింఛన్లు వస్తాయోలేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే కోసం ఆగస్టులో సొంతూళ్లకు వచ్చిన వలసజీవులు, ఇటీవలే దసరా పండుగకూ ఓ సారి వచ్చిపోయారు. మళ్లీ ఇపుడు సర్కార్ సంక్షేమ ఫలాలు పొందాలంటే తప్పకుండా ఊర్లోనే ఉండాలని నిబంధన విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ పల్లెబాట పడుతున్నారు. ఇలా 15రోజులకోసారి స్వగ్రామాలకు వెళ్లిరావడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని, దరఖాస్తు చేసుకున్నాక మరో 15 రోజుల పాటు గ్రామాల్లోనే ఉంటే తమ పూట గడిచేదెట్లా? అని శ్రామికులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 25 వరకు పరిశీలనలు జరుపుతున్న సమయంలో కూడా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ఏ అధికారి ఎప్పుడు తమ ఇంటికి వస్తాడో తెలియక వలసజీవులు ఆందోళన చెందుతున్నారు. -
మాది రైతు ప్రభుత్వం
బెజ్జూర్ : టీఆర్ఎస్ సర్కార్ రైతు ప్రభుత్వమని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమ సర్కారుదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బెజ్జూర్ మండల పరిషత్ కార్యాలయం, అర్కగూడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. పంటల రుణమాఫీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు రుణం ఇవ్వకుంటే తమకు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. 53 రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫొటోలతో సహా వివరించామని, స్పందించిన ఆయన ఐదేళ్ల కాలంలో సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నారని తెలిపారు. డూప్లికేట్ పట్టా పాస్‌పుస్తకాలపై రుణం పొందినవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం నుంచి అధికారులు పంటనష్టం సర్వే చేస్తారని, జాబితాను గ్రామ పంచాయతీలో ప్రదర్శనకు పెడతారని తెలిపారు. రోడ్డు మరమ్మతుల కోసం రూ.7 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.20 లక్షలు విడుదల చేస్తామని చెప్పారు. రెండు రోజుల్లో తునికాకు రాయల్టీ డబ్బులు కూలీలకు అందుతాయన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, ఐటీడీఏ ద్వారా రోడ్లు బాగు చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప మాట్లాడుతూ వరదలతో ఏటా నాగుల్వాయి,లోడ్పెల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచాలన్నారు. అంతకుముందు బారెగూ డ వంతెన, దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి పరిశీలించారు. బెజ్జూర్‌లో ఫొటో ప్రదర్శనను తిలకించారు. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాజి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీఆర్వో భీమ్‌కుమార్, ఎంపీడీవో చంద్రకళ, ఎంపీపీ సిర్పూరం మంజుల, జెడ్పీటీసీ శారద, ఉట్సారంగపెల్లి సర్పంచ్ విశ్వేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆధార్‌పై రైతుల్లో ఆందోళన
డిచ్పల్లి : టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన పంట రుణమా ఫీ పథకం అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రు ణమాఫీ పథకం వర్తింప జేయడంలో ఆధార్ నెంబరు తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయి తే ఈ విషయంలో కొందరు అధికారులు ఒకరకంగా, మరికొందరు అధికారులు మరోరకంగా చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆ ధార్ అనుసంధానంతో తమకు లాభం జరుగుతుం దా, లేక నష్టం జరుగుతుందా అనే విషయమై రైతులు మదనపడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళంగా మారింది. బ్యాంకుల్లో రైతుల బారులు.. పంట రుణాలు పొందిన రైతు కుటుంబంలో *లక్ష వర కు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం రైతులు తప్పనిసరిగా ఆధార్ జిరా క్స్ పత్రాలను బ్యాంకులు, సహకార సంఘాల్లో అందజేయాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు బ్యాంకులు, సింగిల్ విండోల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు తాత, తం డ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూముల్లో పంటలు సాగుచేస్తున్నారు. రుణాలు సైతం వారి పేర్లమీదే పొందారు. ఇప్పుడు రుణం పొందిన వారి ఆధా ర్ కార్డు సమర్పించాలని అధికారులు అడగటంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. గడువుపై స్పష్టత లేదు.. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ అర్హత పొందేందుకు రైతులు బ్యాంకు పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇవ్వాలని బ్యాంకర్లు కోరుతున్నా రు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయాధికారులు సైతం రైతులకు సమాచారం అందజేస్తున్నారు. అయితే అధా ర్ కార్డు జిరాక్స్‌లను ఎప్పటిలోగా అందజేయాలనే దానిపై గడువు స్పష్టంగా చెప్పడం లేదు. కానీ మండల స్థాయి అధికారులు తమ మండలాల్లో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, ఈనెల 30లోగా రుణమాఫీ అర్హత గల రైతుల జాబితాను అందజేయాలని సూచి స్తున్నారు. బ్యాంక ర్లు ఇచ్చిన జాబితాను కలెక్టర్‌కు అందజేస్తామని మండల అధికారులు తెలుపుతున్నా రు. ఈనెల 28, 29 తేదిల్లో గ్రామసభలు నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆధార్ పొందని రైతులు నమోదు కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.నెలాఖరులోగా ఆధార్‌కార్డు సహా అన్ని పత్రాలు అందించకుంటే రుణమాఫీ వర్తించదేమోనన్న ఆందోళన వారిలో ఉంది. అధార్ కార్డులో పేరు తప్పుగా వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామసభల్లో నిర్ధారిస్తాం.. రుణమాఫీకి ఆధార్‌కార్డు ఇవ్వని వారిని పరిగణలోకి తీ సుకుంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులను ఆధార్ జిరాక్స్‌లు తప్పనిసరిగా కావాలని అడగటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీకి అర్హత గల రైతుల పేర్లను రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సరిపోల్చుకుని గ్రామసభల్లో నిర్ధారిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా రైతుల్లో ఆందోళన తొలగడం లేదు.