
అసెంబ్లీ బోనులో సర్కారును నిలబెట్టాలి
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఫల్యాలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ బోనులో నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఏడాది 15 రోజులు కూడా అసెంబ్లీ జరగనందున, ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఇరవై రోజులకు తగ్గకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
శనివారం బీజేఎల్పీ సమావేశానంతరం అసెంబ్లీ కమిటీ హాలులో పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్ ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 15న బీఏసీ సమావేశం జరగనున్న నేపథ్యంతో ఆ భేటీ తర్వాత మళ్లీ సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేస్తామని చెప్పా రు. టీఆర్‌ఎస్ సర్కార్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు.