
చంద్రబాబు నాయుడు
రుణమాఫీచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో చెప్పారు. కాని ఇప్పుడే సంతకం చేస్తారా? అని అడగడం కరెక్టు కాదని ఆయన అన్నారు.
హైదరాబాద్: రుణమాఫీచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో చెప్పారు. కాని ఇప్పుడే సంతకం చేస్తారా? అని అడగడం కరెక్టు కాదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రతిపక్ష నేత వైస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు ప్రస్తుతం కమిటీతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఖరీఫ్ మొదలైనా ఇప్పటికీ రుణాలు అందటం లేదన్నారు. మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవటంతో ప్రైవేటుగా మూడు రూపాయిల వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమాదానం చెబుతూ రుణమాఫీ చేస్తామని, అయితే ఆర్థిక ఇబ్బందులున్నాయని మాత్రం తెలిపారు. కానీ రుణమాఫీ ఏ తేదీ నుంచి అమలు చేసేది ఆయన స్పష్టం చేయలేదు.