ధర్మవరం : రైతుల రుణమాఫీని 5-10 ఏళ్ల వ్యవధిలో చేస్తామని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొనడం చూస్తే ఈ ప్రభుత్వం రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. అన్నేళ్ల వ్యవధి తీసుకుంటే ప్రభుత్వం అంతవరకు ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
సోమవారం ఆయన ధర్మవరంలోని పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో మాట్లాడుతూ మంత్రులు రుణమాఫీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి సమాచారం రాలేదంటూ రుణమాఫీని తాత్సారం చేస్తున్నారన్నారు. అసలు బ్యాంకులకు సమాచారం ఎప్పుడు వస్తుంది.. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు పీడిత అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది పంటల బీమా కోల్పోయినందున రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నమే.. శంకరనారాయణ ధ్వజం
Published Tue, Aug 5 2014 2:47 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement