pattipati pullarao
-
చంద్రబాబుకు షాకిచ్చిన పుల్లారావు
-
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఆధారాలు సేకరించిన సీఐడీ
-
ప్రత్తిపాటి, నారాయణలపై కేసులు
సాక్షి, అమరావతి/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుల్లారావు, నారాయణ, నరసింహారావులపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120/బిలతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గురువారం మంగళగిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు.. 761 ఎకరాల కొనుగోలు రాజధాని రాకముందే రంగంలోకి దిగిన బెల్లంకొండ నరసింహారావు అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కుంటుందని భయపెట్టాడు. నరసింహారావు తన పేరిట ఉన్న 99 సెంట్ల అసైన్డ్ భూమిని బలవంతంగా రాయించుకుని భూ సమీకరణ కింద పరిహారం కూడా పొందినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టగా ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని ఆధారాలు ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో నిర్ధారణ అయింది. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.38,56,84,000 ఉంటుందని తేలింది. (చదవండి: తెల్లబోయే దోపిడీ) తెల్ల రేషన్‌కార్డుదారుల పేరుతో బినామీలు కొన్న భూములు ►అమరావతి మండలంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 ఎకరాలు కొన్నారు. ►పెదకాకాని మండలంలో 43 మంది 40 ఎకరాలు కొన్నారు. ►తాడికొండలో 188 మంది 190 ఎకరాలు కొన్నారు. ►తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలు కొనుగోలు చేశారు. ►మంగళగిరిలో 148 మంది 134 ఎకరాలు కొన్నారు. ►తాడేపల్లి మండలంలో 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు 24 ఎకరాలు కొనుగోలు చేశారు. ►797 తెల్ల రేషన్ కార్డుదారుల్లో 268 మందికి పాన్ కార్డు ఉంది. ►761 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ రూ 38.50 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.220 కోట్లకుపైగా ఉంటుంది. నాలుగు బృందాలతో విచారణ.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సీఐడీ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అసైన్ట్ భూములపై విచారిస్తుండగా మరో బృందం తెల్ల రేషన్ కార్డులపై దర్యాప్తు జరుపుతోంది. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారికి సంబంధించి మరో బృందం వివరాలు సేకరిస్తుండగా నాలుగో బృందం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను విచారిస్తోంది. (చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!) (చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..) -
మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ) విచారణలో ఆసక్తికర విషయాలు: మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంతో 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడికొండలో120 ఎకరాలను 188 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కాగా తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది తెల్ల కార్డుదారులు కొనుగొలు చేయగా, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొనుగొనులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. (చదవండి: తెల్లబోయే దోపిడీ) -
బినామీ బాగోతం..!
సాక్షి, నరసరావుపేట: అక్రమ బినామీ టెండర్ల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. మాజీ మంత్రి అండదండలను అడ్డం పెట్టుకున్న యాజమాన్యం కార్మికులను పావులుగా వాడుకొని భారీ అక్రమార్జనకు పాల్పడింది. కోట్ల రూపాయలు బాధితులకు పంగనామం పెట్టింది. చివరకు డబ్బులు చెల్లించాలని బ్యాంక్ అధికారులు జారీ చేసిన నోటీసులతో బాధితులు లబోదిబోమంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. మద్యం మాఫియా చేసిన మోసంపై వన్‌టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముఖ్య అనుచరుల మద్యం మాఫియా అక్రమ బాగోతం ఒకటి వెలుగు చూసింది. అప్పటి అధికారాన్ని అడ్డంపెట్టుకొని బినామీ టెండర్లు దక్కించుకున్న టీడీపీ నాయకులు కార్మికులను నమ్మించి నట్టేట ముంచారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన తెల్లబాటి కోటేశ్వరరావు మద్యం దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 2017–19 సంవత్సరానికి గానూ ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్లు పిలవగా మురళీకృష్ణ వైన్స్ యజమానులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులైన నిమ్మల మురళీకృష్ణ, తన్నీరు సాంబశివరావులు కోటేశ్వరరావును పిలిచి దుకాణంలో పనిచేసే కొంత మంది కార్మికులతో బినామీ టెండర్ దరఖాస్తులు వేయించాలని కోరారు. దీంతో పనిచేసే వాళ్ల పేరిట సుమారు 230 దరఖాస్తులు వేయగా అందులో చిలకలూరిపేట నియోజకవర్గం, ప్రకాశం జిల్లాల్లో మద్యం దుకాణాలు నిర్వహించేందుకు 11 దుకాణాలు దక్కాయి. అవన్నీ కార్మికుల పేరిట రావటంతో వారి ఆధార్, బ్యాంక్ పాస్‌పుస్తకాలను దుకాణ యజమానులు మురళీకృష్ణ, సాంబశివరావు తీసుకొని నరసరావుపేట బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు తెరిపించారు. మద్యం లైసెన్స్ లను బ్యాంక్ లో గ్యారెంటీలుగా చూపించి ఒక్కొక్కరి పేరిట రూ.11.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పుతీసుకున్న వారికి ఒకరికి తెలియకుండా మరొకరికి షూరిటీ పెట్టించారు. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి అవ్వటంతో ఇటీవల బ్యాంక్ అధికారులు డబ్బులు చెల్లించాలని లైసెన్స్ హోల్డర్స్‌గా ఉన్న కార్మికులకు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్క లైసెన్స్ హోల్డర్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించాలని నోటీసులో పేర్కొని ఉంది. దీంతో నిర్ఘాంతపోయిన వారంతా వెళ్లి బ్యాంకులో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 11 మంది లైసెన్స్ హోల్డర్స్ సుమారు రూ. కోటి రూపాయల వరకు కట్టాలని తెలుసుకున్న బాధితులు ఈ విషయంపై దుకాణ యజమానులు మురళీకృష్ణ, సాంబశివరావును ప్రశ్నించగా వారు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు జరిగిన మోసం పై వాపోయారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షేక్ బిలాలుద్దిన్ తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలతో ప్రత్తిపాటి రూ.కోట్లు కాజేశారు..
సాక్షి, చిలకలూరిపేట: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ భూముల విషయంలో మంత్రి భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ యథేచ్ఛగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. మంత్రి స్థాయిలో ఉండి అగ్రిగోల్డ్ బాధితుల భూములను కొనుగోలు చేయటమే ఒక తప్పు అయితే, ఆ భూముల అమ్మకానికి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయటం మరోతప్పు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నుంచి ఆదేశాలు వస్తే చాలు తప్పో.. ఒప్పో అనవసరం నిబంధనలను పక్కన పెట్టి మరీ అధికారులు పనులు పూర్తి చేశారు. అయితే ఇక్కడ మరొక అడుగు ముందుకు వేసి మంత్రి సతీమణికి పాసుపుస్తకం కావాలంటే ఏకంగా దొంగపాసు పుస్తకం తయారు చేసి ఇచ్చేశారు. ఈ పాసుపుస్తకం అధారంగానే రూ.కోట్లు విలువైన భూముల విక్రయాలు కొనసాగాయి. ఫోర్జరీకి పాల్పడిన మంత్రి సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మపై చర్యలు తీసుకోవాలని ఈనెల 23న ఏపీఎస్ఆర్టీసీ శాతవాహన రీజియన్ మాజీ చైర్మన్ మల్లాది శివన్నారాయణ ఆధారాలతో సహా అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ కొనుగోళ్లు ఇలా.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో మంత్రి పుల్లారావు సతీమణి అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారు. భర్త మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన కనుకొల్లు ఉదయదినకర్ వద్ద నుంచి గురిజేపల్లి గ్రామ సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 105/5, 104/6, 103/2లలో మొత్తం ఆరు ఎకరాల 19 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 423/15తో 2015 జనవరి 19న కొనుగోలు చేశారు. దీంతో పాటు ఉదయదినకర్కు బినామీగా ఉన్న ప్రగడ విజయకుమార్ వద్ద నుంచి సర్వే నంబర్ 104/1, 104/2, 104/3లలో మరో రెండు ఎకరాల 61 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 2851తో 2015 ఏప్రిల్ 17న, సర్వే నంబర్ 104/4లో మరో 57 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 2850/2015న కొనుగోలు చేశారు. వీటితో పాటు సర్వే నంబర్ 101/1లో ఐదు ఎకరాల 44 సెంట్ల భూమిని బండ శ్రీనివాసబాబు నుంచి సేల్‌డీడ్ నంబర్ 2852/15 తో అదే రోజు కొనుగోలు చేశారు. ఇందుకోసం పాసుపుస్తకం నంబర్ 246275 పేరుతో టైటిల్ డీడ్, పట్టాదారు పాసుపుస్తకం తయారైంది. తక్కువకు కొని.. 2015 జనవరి, ఏప్రిల్ మాసాల్లో కనుకొల్లు ఉదయదినకర్, మరో ఇద్దరి నుంచి ఎకరా రూ.20 లక్షల చొప్పున మొత్తం 14.81 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ వెంచర్లు వేసేందుకు ఈ భూములను అంతకుముందు కొనుగోలు చేసినప్పటికీ అప్పటికే సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేసేందుకు ఇతరుల నుంచి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రివర్యులు తన పలుకుబడి ఉపయోగించి ఈ భూములను బెదిరించి చౌకగా కొనుగోలు చేసినట్లు తదుపరి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ మొత్తం 14.81 ఎకరాల భూమిని 2015 జూన్ 4న ఎకరా రూ.52 లక్షల చొప్పున కామేపల్లి లక్ష్మీప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు అనే ఇద్దరికి విక్రయాలు చేశారు. దీంతో మంత్రి కుటుంబానికి ఈ వ్యవహారంలో కోట్ల లబ్ధి చేకూరింది. సంతకాలు ఫోర్జరీ.. గతంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరులో పనిచేసి వెళ్లిన తహసీల్దార్ శామ్యూల్ వరప్రసాద్ సంతకంతో పాసు పుస్తకాన్ని తయారు చేశారు. ఇందులో ఎక్కడా అధికారుల సంతకాల వద్ద కనీసం తేదీ లేదు. దీంతో పాటు వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశారు. మంత్రి సతీమణికి రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాసుపుస్తకంలో వ్యవసాయదారుని సంతకం వద్ద మంత్రి సతీమణి సంతకం ఉండాల్సి పోయి గతంలో పొలం అమ్మిన ఉదయ్ దినకర్ సంతకం ఉండటం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని కాగితాలూ పకడ్బందీగా చూసి రిజిస్ట్రేషన్ జరపవలసిన సబ్ రిజిస్ట్రార్.. వ్యవసాయదారుని సంతకం చూడకుండా రిజిస్ట్రేషన్ జరిపించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంత్రికి రిజిస్ట్రేషన్ చేసిన ఉదయ్దినకర్కు చెందిన పాసుపుస్తకాల ఖాతా నంబర్ 525.. మంత్రి సతీమణికి ఇచ్చిన పాసుపుస్తకాల ఖాతా నంబరు కూడా 525 కావటం గమనార్హం. మంత్రి సతీమణికి జారీచేసిన పాసుపుస్తకాలు చేతిరాతతో రాసిఉన్నాయి. ప్రస్తుతం పాసుపుస్తకాలను ఆన్లైన్లో కంప్యూటర్ ప్రింట్ చేసి ఇస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీవో సంతకాలు కూడా డిజిటల్ సిగ్నేచర్‌తో వస్తున్నాయి. కానీ ఈ పాసుపుస్తకాలపై అధికారులు చేతి రాతతో సంతకాలు పెట్టినట్టు ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకాలపైన మంత్రి సతీమణి ఫొటో వద్ద ఉన్న తహసీల్దార్ సంతకం, కింద తహసీల్దార్ సంతకం వేర్వేరు కావటం పాసు పుస్తకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దొంగలెవరు? పాసు పుస్తకం సామాన్యులకు దొరకటానికి ప్రస్తుతం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ భూములు కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే పట్టాదారు పాసుపుస్తకం తయారు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాసు పుస్తకం ఎక్కడ తయారైంది? పాసుపుస్తకం తయారు కావడానికి సహకరించిన వ్యక్తులు ఎవరు? తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా బయట వ్యక్తులు నకిలీ పాసుపుస్తకం తయారు చేశారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. బాధ్యులెవరు? తన భూముల విక్రయానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా నకిలీ పాసుపుస్తకాలను వినియోగించడం పెద్ద నేరం. గతంలో పల్నాడు కేంద్రంగా జరిగిన పలు నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో పలువురు వీఆర్వోలను, వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి వీరిని ఆశ్రయించి, తన భార్యపేరుపై నకిలీ పాసు పుస్తకాన్ని సృష్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రయ సమయంలోనూ చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ పూర్తి స్థాయిలో పాసుపుస్తకాన్ని పరిశీలించకుండా మంత్రి ఆదేశాలతో పని కానివ్వడంతో కోట్లాది రూపాయల విలువైన విక్రయాలు కొనసాగాయని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రిగా ఉండి కూడా నకిలీ పాసుపుస్తకాన్ని ఉపయోగించి ఆస్తుల విక్రయానికి పాల్పడిన మంత్రే ప్రథమ నిందితుడని, ఈ విషయంలో లోతైన, నిష్పక్షపాతమైన విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘నిరసనా, ఒత్తిడి తేవడమా త్వరలో నిర్ణయం’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై నిరసన తెలపడమా, ఒత్తిడి తేవడమా అనే దానిపై త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం సాయంత్రం జరిగిన సివిల్ సర్వీస్ ఉద్యోగుల జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగింపు సభకు హాజరైన మంత్రి కేంద్ర బడ్జెట్‌పై విలేకరుల వద్ద స్పందించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ఆశించినమేర నిథులు ఇవ్వలేదన్నారు. ఏపీకి 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దానిని కేంద్ర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఏపీలో ప్రధానాంశాలైన పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, రైల్వేజోన్ అంశాలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం, ఏపీ విభజన చట్టం అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. సెంట్రల్ వర్సిటీలకు 30 కోట్ల చొప్పున కేటాయించినా అవి కూడా పూర్తి స్థాయి కేటాయింపులు కాదన్నారు. కీలక రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలకు ఊరట లభించలేదన్నారు. ఏపీకి కేటాయింపులపై మోదీ పునరాలోచించుకోవాలని సూచించారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..
గ్రానైట్ కోటలో పాగాకు ప్రత్తిపాటి పక్కా స్కెచ్ ► 416 ఎకరాల దళితుల భూములు కొట్టేసేందుకు మంత్రి వ్యూహం ► అందులో ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ ఖనిజంపై కన్ను ► వివిధ శాఖల అనుకూల నివేదికలతో పక్కా ప్రణాళిక ► పచ్చటి పొలాలను.. పంటలు పండని భూములుగా చూపిన వైనం ► అనుచరులు, ఉద్యోగుల ద్వారా మైనింగ్‌కు దరఖాస్తులు ► బాధిత రైతుల ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ అన్ని విధాలా వెనుకబడిన దళితులను ఆదుకోడానికి 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములిస్తే.. ఇన్నాళ్లూ వారు చక్కగా పంటలు పండించుకుని జీవనం సాగించారు. అలాంటి భూముల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని ఓ ప్రభుత్వ శాఖ నివేదిక ఇచ్చింది. ఇతర శాఖలూ ఇందుకు వంతపాడాయి. అలాంటి భూములు మీకెందుకంటూ ప్రభుత్వం పట్టాలను రద్దు చేసింది. బంగారం పండే భూములను లాక్కోవడం అన్యాయమంటూ పేద దళిత రైతులు లబోదిబోమంటున్నా సర్కారు వినిపించుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే ఆ భూముల్లో రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ రాయి ఉండటమే అని తెలిసింది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి : దళితుల కడుపుకొట్టి వేల కోట్లకు పడగలెత్తేందుకు ఓ అమాత్యుడు చక్కటి వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. వివిధ శాఖల అధికారులను లోబరుచుకుని తనకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుని చక్రం తిప్పుతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని 250 మంది నిరుపేద దళితులకు సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 19, 1975లో అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లుకలాపు లక్షణదాసు, నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్యలు సర్వే నెంబర్ 381లో 416.50 ఎకరాలను కేటాయించారు. లబ్ధిదారులందరికీ ఏకపట్టాగా ఆ భూమిని అందచేయడంతో వారంతా 1976లో ‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్’’ పేరుతో గ్రూపుగా ఏర్పడ్డారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3.20 కోట్ల వ్యయంతో శ్రీ అరుణోదయ సోమేపల్లి సాంబయ్య ఎత్తిపోతల పథకం ఏర్పాౖటెంది. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా దళిత రైతులు ఏటా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. చక్రం తిప్పిన ప్రత్తిపాటి పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఆ భూమిలో ఉప్ప శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. దరఖాస్తుదారుల్లో కొందరి వివరాలు ► వై.శివయ్య తండ్రి బాలకోటయ్య, డోర్ నెం 1–130.యడవల్లి గ్రామం. ఇతని భార్య రమాదేవి. యడవల్లి గ్రామ సర్పంచ్. టీడీపీ. ► వై.రవీంద్రబాబు, తండ్రి శివయ్య, డోర్ నెం 1–130, యడవల్లి గ్రామం. యడవల్లి గ్రామ సర్పంచ్ రమాదేవి కుమారుడు. ► సీహెచ్ వెంకటరామిరెడ్డి, తండ్రి సుబ్బరామిరెడ్డి, డోర్ నెం 5–285, జాలయ్యకాలనీ, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు కుమార్తె స్వాతి ► పేరున గణపవరం గ్రామంలో ఉన్న స్వాతి ఆయిల్ మిల్స్‌లో సూపర్వైజరుగా పని చేస్తున్నారు. ► షకీలా సాంబశివరావు, తండ్రి కష్ణమూర్తి, డోర్‌నెం 2–52–2, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో (టీఎంసీ యూనిట్)లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ► తాళ్లూరి సుబ్బారావు, తండ్రి రాములు, డోర్‌నెం 3–404,9వ లైన్, పండరీపురం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తి మిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► బొమ్మినేని రామారావు, తండ్రి పాపయ్య, గణేశునివారిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► ఎం.సుధాకర్‌రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, డోర్ నెం 3–104, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► కొమ్మాలపాటి పూర్ణచంద్రరావు, తండ్రి వెంకటేశ్వర్లు, డోర్ నెం.5–46/5–1, మువ్వవారి బజార్, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో టీఎంసీ యూనిట్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ► మేడూరి సత్యనారాయణ, తండ్రి పిచ్చయ్య, డోర్ నెం. 4–190, కొండ్రువారి వీధి, గణపవరం గ్రామం. నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గ్రానైట్ నిక్షేపాల వివరాలు యడవల్లి గ్రామంలో లభించే గ్రానైట్‌లో ముఖ్యమైనది బ్లాక్ పెరల్. దీని ధర మీటరు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. సాధారణంగా ఏ క్వారీలోనైనా 6 మీటర్ల లోతు తవ్విన తర్వాతే మంచి మెటీరియల్ లభిస్తుంది. అయితే ఇక్కడ 4 మీటర్ల లోతు తవ్వితే మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఎక్కువ లోతు తవ్వకుండానే నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయి. సొసైటి రద్దుపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ తమకు జరిగిన నష్టంపై బాధిత దళిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. మంత్రి పుల్లారావు సహా టీడీపీ నాయకుల అక్రమాలను వివరించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ విధుల్లో బిజీగా ఉన్నామంటూ మూడుసార్లు హాజరు కాలేదు. 2016 జూలై 10వ తేదీన బాధితులు మరోసారి అర్జీ ఇచ్చారు. దీనిపై సంబంధిత నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు నోటీసులు వచ్చాయి. కష్ణా పుష్కరాలు జరుగుతున్నందున ఆ విధుల్లో బిజీగా ఉన్నామని, తర్వాత వస్తామని కమిషన్ కు ఉన్నతాధికారుల ద్వారా లేఖ పంపారు. అక్టోబర్ 1వ తేదీన కమిషన్ నూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి పాండురంగారావు, డివిజన్ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యలు హాజరయ్యారు. జనవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన విచారణకు అధికారులు హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 8 వ తేదీకి విచారణ వాయిదా వేశారు. వాస్తవాలివీ.. పేద దళితులు ప్రభుత్వం నుంచి భూములు పొందినప్పటి నుంచి సొసైటీ సహకారంతో వరి, పత్తి తదితర పంటలు పండించుకున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా పొందారు. ఆయా సంవత్సరాలలో ఏమేరకు పంటలు సాగయ్యాయన్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉంది. భూములు ఉప్పు కయ్యలుగా మారడానికి సమీపంలో సముద్రం లేదు. ఈ భూములు మినహా చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలలేదు. నిజంగా ఉప్పుశాతం ఎక్కువుగా ఉంటే పంటలు ఎలా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ రికార్డులు సరిగా లేకపోతే నోటీసు ఇవ్వాలి. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరక్ష్యరాస్యతను ఆసరాగా తీసుకుని రికార్డులు సరిగా నమోదు చేయలేదనడం సరికాదని బాధిత రైతులు వాపోతున్నారు. 25.08.2012 : నరసరావుపేట ఆర్డీవో, మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయరు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు యడవల్లి భూముల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 04.09.2015 : ఈ భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల సాగుకు యోగ్యమైనవి కావని నరసరావుపేట వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నివేదిక ఇచ్చారు. 02.12.2015 : చిలకలూరిపేట హార్టీకల్చర్ అధికారి కూడా ఈ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఇచ్చారు. 02.12.2015 : నిబంధనల ప్రకారం యడవల్లి సొసైటీ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, ఆసొసైటీని రద్దు చేస్తున్నామని జిల్లా సహకార శాఖ నివేదిక ఇచ్చింది. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మంత్రి బినామీలే ఒక వైపున సొసైటీని రద్దు చేయించడానికి మంత్రి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున ఆ భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి కోరుతూ తనకు అనుకూలమైన వ్యక్తులతో మైనింగ్ శాఖకు ముందస్తుగానే దరఖాస్తు చేయించారు. ఏడాది కాల వ్యవధిలోనే 39 మంది వ్యక్తులు యడవల్లి భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం గమనార్హం. మైనింగ్ నిబంధనల ప్రకారం తొలి దరఖాస్తుదారుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా మొదటి 20 దరఖాస్తుల్లో మంత్రి అనుచరులు, ఆతని సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారనేది సమాచారం. వీరందరికీ త్వరలో గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేందుకు మైనింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి.. బాధిత దళిత రైతులందరూ మంత్రి పుల్లారావును కలిశారు. తాము ఎప్పటి నుంచో ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, ఉన్నఫళంగా తమకు భూములు లేకుండా చేస్తే ఎలా బతకాలని గోడు వెల్లబోసుకున్నా మంత్రి స్పందించలేదు. -
‘చంద్రబాబు సలహా తీసుకుంటే బాగుండేది’
అమరావతి: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయానికి ముందు దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు లాంటి వారి సలహాలు తీసుకుని ఉంటే ఇపుడు ఇబ్బందులు తలెత్తేవి కాదని ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలనుకున్నపుడు రహస్యంగానైనా సూచనలు, సలహాలు తీసుకుని ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ప్రజలు నోట్ల రద్దు అనంతరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల అన్ని రంగాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు బ్యాంకు అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించటంతో పాటు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా పార్టీకి లాభమా, నష్టమా అన్నది డిసెంబర్ తరువాత తెలుస్తుందన్నారు. -
పరిహారం చెల్లించకపోతే పీడీ యాక్టు
అమరావతి: నకిలీ విత్తన కంపెనీలు రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే యజమానులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన 13 జిల్లాల వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైబ్రీడ్ విత్తనాలు అమ్మకం దారులకు ఆర్ఎన్డీ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కంపెనీలు ఎక్కడ విత్తనాలు వేసి పండించాయో సాక్ష్యం లేకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విత్తనాలను డిపార్ట్మెంట్ పరీక్షించిన తర్వాతే బయటకు రిలీజ్ చేయాలని సూచించారు. తయారుదారీ కంపెనీల బిల్లులు లేకుండా డీలర్లు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 200 బయో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటుగా ప్రో ఫార్మర్స్ అడ్వకేట్స్ను పెట్టుకొని కేసులు పరిష్కరించాలని తెలిపారు. వీటిపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డెరైక్టర్ ధనుంజయరెడ్డిని ఆదేశించారు. డీలర్‌ను సస్పెండ్ చేస్తే మార్పు రాదని, కంపెనీ యజమానులను బాధ్యులను చేసి అరెస్టు చేయాలని సూచించారు. జీవీ, బ్రహ్మపుత్ర, ఆధార్ వంటి నకిలీ విత్తనాల కంపెనీలపై జేడీలు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. డీడీలు, ఏడీలకు ఆరునెలల పాటు వాహన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ఆలోగా ఎన్ని కేసులు పరిష్కరించారు, ప్రగతిని బేరీజు వేస్తానని తెలిపారు. -
మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మంత్రులకు, అధికారులను క్లాస్ పీకారు. ఉద్యోగుల బదిలీలను ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులను సమన్వయం చేసుకోనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇంచార్జీ మంత్రిగా పెట్టి ఉపయోగం ఏముందని ఆయన ప్రశ్నించారు. గుంటూరు-విజయవాడ మధ్య గంట దూరం లేకపోయినా వచ్చి కూర్చుని మాట్లాడటానికి మీకు తీరిక ఉండటం లేదా... చెప్పింది అర్థం చేసుకోకుండా...సిన్సియారిటీ లేకుండా పని చేస్తే ఎలా అని ధ్వజమెత్తారు. మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీల మధ్య కూడా సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎందుకింత ఇగోలతో ఉన్నారో అర్ధం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
భూ సేకరణపై వాడీవేడీ చర్చ
గుంటూరు: ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం జారీ చేసిన భూ సేకరణ చట్టంపై గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే తాము భూ సేకరణ చట్టంజోలికి వెళ్లం అని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. భూములు లాక్కొని అన్నదాతను రోడ్డున పడవేస్తున్నారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. తాము భూసేకరణకు వ్యతిరేకం అంటూ 166 జీఓ కాపీని ఆర్కే చించివేశారు. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకత తెలుపుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు అందరూ జడ్పీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
'చేపల చెరువుల మరమ్మతుకు అనుమతక్కర్లేదు'
విజయవాడ: మత్స్య సంపద వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మంత్రులిద్దరూ విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. మత్స్యకార రంగంలో రూ. లక్షా 40 వేల కోట్ల టర్నోవర్ వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక మీదట చేపల చెరువుల మరమ్మతులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైనా చెరువులను మరమ్మతు చేసుకోవచ్చని తెలియజేశారు. మత్స్యకారుల కోసం ఫిషరీస్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. -
ఫోన్ కాల్ అంటేనే భయపడుతున్న.. మంత్రి!
హైదరాబాద్ : వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం కేవలం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై ఏమైనా సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఫోన్లు శర పరంపరగా వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వరుసగా వస్తున్న ఫోన్లతో ఆయనకు క్షణం కూడా తీరిక లేకుండా పోతోందట. రుణాల మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడుతున్నారట. రైతు సమాచారం కోరుతూ మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నా సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..! -
వ్యవసాయం ఏదీ?
కనీసం భరోసా కూడా కల్పించలేకపోయారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఇందులో కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులేవీ కేటాయించలేదు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా రైతులకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలేనని పదేపదే ప్రస్తావించారు. అటువంటి కరువు జిల్లాపై చంద్రబాబు ప్రభుత్వం కరుణించలేదు. నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా బనవాసిని గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధనా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదోని, ఆలూరు, నందికొట్కూరు పరిధిలో సాగవుతున్న పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని.. ఆలూరు ప్రాంతంలో జింకల పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్క దానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు. -
రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నమే.. శంకరనారాయణ ధ్వజం
ధర్మవరం : రైతుల రుణమాఫీని 5-10 ఏళ్ల వ్యవధిలో చేస్తామని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొనడం చూస్తే ఈ ప్రభుత్వం రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. అన్నేళ్ల వ్యవధి తీసుకుంటే ప్రభుత్వం అంతవరకు ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన ధర్మవరంలోని పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో మాట్లాడుతూ మంత్రులు రుణమాఫీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి సమాచారం రాలేదంటూ రుణమాఫీని తాత్సారం చేస్తున్నారన్నారు. అసలు బ్యాంకులకు సమాచారం ఎప్పుడు వస్తుంది.. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు పీడిత అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది పంటల బీమా కోల్పోయినందున రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రుణ మాఫీకి ఆధార్‌తో లింకు!
చంద్రబాబు సర్కారు కొత్త మెలిక హైదరాబాద్: రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టబోతోంది. రుణ మాఫీకి ఆధార్ కార్డుకూ ముడిపెట్టాలని నిర్ణయించింది. నకిలీ పత్రాలతో, భూమి లేకుండా రుణాలు తీసుకున్న వారు, టెన్ వన్ అడంగల్‌తో రుణాలు పొందిన వారిని కట్టడి చేసేందుకు రుణ మాఫీని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధార్ కార్డు ద్వారా నకిలీలను నివారిస్తామని, సరైన పత్రాలు, పట్టాదారు పాసు పస్తకాలతో రుణాలు పొందిన వారికి ఇబ్బంది ఉండదని అన్నారు. ఆధార్ లేనివారి విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని చెప్పారు. ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకున్న తరువాత వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. తాము రూపొందించే మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే వారి రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని, మిగిలిన వారు తమ బకాయిలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణమాఫీ చేయకుంటే ఉద్యమమే కాకినాడ: రుణమాఫీ అమలు కాకుంటే కోనసీమ రైతులు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో బుధవారం సమావేశమైన రైతులు రుణమాఫీ తప్ప మరో మార్గం వెతకవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రుణమాఫీకి మరో మెలిక
-
రుణమాఫీకి మరో మెలిక
హైదరాబాద్: ఏపీలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం మరో మెలిక పెట్టనుంది. రుణం మాఫీ చేయాలంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డును చూపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రమ లబ్ధిదారులను అరికట్టడానికే ఆధార్ లింక్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. చాలామంది నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆ విధంగా రుణం పొందినవారిని నియంత్రించేందుకే ఆధార్ ఆలోచన అని మంత్రి చెప్పారు. -
'బ్యాంకర్లు రుణమాఫీకి అంగీకరించటం లేదు'
హైదరాబాద్ : రైతు రుణమాఫీపై ఉమ్మడి రాష్ట్రంలో హామీ ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర విబజన తర్వాత ఆ హామీ నుంచి వెనక్కి తగ్గలేకపోయామన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశం పెట్టామని పత్తిపాటి పేర్కొన్నారు. అప్పటికి, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితిలో చాలా తేడా ఉందని ఆయన అన్నారు. రుణమాఫీకి బ్యాంకర్లు అంగీకరించటం లేదని పత్తిపాటి తెలిపారు. 26వ తేదీన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాతే స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. కాగా ఆర్బీఐ అభ్యంతరాల నేపథ్యంలో కోటయ్య కమిటి తుది నివేదిక ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. వ్యవసాయ రుణ మాఫీకి సహకరించాలని చంద్రబాబు ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. దీనిపట్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే చంద్రబాబు లేఖ రాయడానికి ముందే ఆర్బీఐ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రుణ మాఫీపై లేఖలు రాసిన విషయం తెలిసిందే.