
భూ సేకరణపై వాడీవేడీ చర్చ
గుంటూరు: ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం జారీ చేసిన భూ సేకరణ చట్టంపై గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే తాము భూ సేకరణ చట్టంజోలికి వెళ్లం అని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు.
భూములు లాక్కొని అన్నదాతను రోడ్డున పడవేస్తున్నారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. తాము భూసేకరణకు వ్యతిరేకం అంటూ 166 జీఓ కాపీని ఆర్కే చించివేశారు. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకత తెలుపుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు అందరూ జడ్పీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.