![Alla Ramakrishna Reddy Helps Move Accident Victim To Go Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/9/rk.jpg.webp?itok=drgrld01)
సాక్షి, గుంటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను ఆస్పత్రికి తరలించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన మానవత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లి శివారులో సోమవారం రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ధనలక్ష్మీ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న ఆర్కే.. ప్రమాద విషయాన్ని గమనించి తన కారులోఆమెను ఆస్పత్రికి తరలించారు. దగ్గర ఉండి మహిళకు చికిత్సను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment