
'చేపల చెరువుల మరమ్మతుకు అనుమతక్కర్లేదు'
విజయవాడ: మత్స్య సంపద వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మంత్రులిద్దరూ విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. మత్స్యకార రంగంలో రూ. లక్షా 40 వేల కోట్ల టర్నోవర్ వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇక మీదట చేపల చెరువుల మరమ్మతులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైనా చెరువులను మరమ్మతు చేసుకోవచ్చని తెలియజేశారు. మత్స్యకారుల కోసం ఫిషరీస్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.