మోసం బాబు నైజం!
కురుపాం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమా ఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి, మో సం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని ధ్వజ మెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆమె ఇక్కడి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం విస్మరిం చిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నార న్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక రైతుకు రూ. 150 మాత్రమే రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే నెలకొందన్నారు. ఎన్నికల మే నిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటిలో మూ టలగానే మిగిలాయన్నారు. బాబు ఏడు నెలల పాలన పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ ఎప్పుడూ అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం పోయిం దన్నారు. ఆయన మాయ మాటలను ప్రజలు గత తొమ్మిదేళ్లలో చూశారని చెప్పారు. భవిష్యత్తు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
జగన్ దీక్షకు వెళ్లిన బొబ్బిలి నాయకులు
బొబ్బిలి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతుదీక్షకు బొబ్బిలి నియెజకవర్గం నుంచి అధిక సం ఖ్య లో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పార్టీ జిల్లా కార్యదర్శి, రామభధ్రపురం మండల నాయకుడు మడక తిరుపతినాయుడు, ఆ మండలానికి చెందిన కర్రొతు తిరుపతిరావు, డబ్ల్ల్యూవీఎల్‌ఎన్ రాయలు, బొ బ్బిలి పట్టణానికి చెందిన బొబ్బాది తవిటినాయుడు, పర్తాపు చంద్రశేఖర్, మండలానికి చెందిన అప్పలనాయుడు, సింహాచలం, రెడ్డి వెంకటనాయుడు, బాడంగి మండలానికి చెందిన గొర్లె శంకరరావు, శ్రీనివాసరా వు తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో వారంతా రెండు రోజుల పాటు దీక్షలో ఉన్నారు.