* ఆరోజు రాష్ట్రస్థారుు బ్యాంకర్ల కమిటీ భేటీ
* వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల రీ షెడ్యూల్‌తో పాటు కొత్తగా రైతులకు రుణాల మంజూరుపై ఈ నెల 30వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు నిమిత్తం ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎల్‌బీసీ భేటీకి సీఎం చంద్రబాబునాయుడు సమయం ఇచ్చారు. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలుపడంతో పాటు ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలంటే పాత రుణాలను చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కాలేదు. తాజాగా రైతుల పాత రుణాలను రీ షెడ్యూల్ చేరుుంచి కొత్తగా రుణాలు మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీ షెడ్యూల్ ఎలా చేయాలి? రైతుల పేరు మీదే రీ షెడ్యూల్ చేస్తారా? అదే జరిగితే రైతులు బ్యాంకులకు వచ్చి సంతకాలు చేస్తారా? లేకపోతే రైతుల పేరు మీద ఉన్న రుణాలను ప్రభుత్వం పేరు మీద బదలాయించుకుని రీ షెడ్యూల్ చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల పేరు మీదే రుణాలను రీ షెడ్యూల్ చేస్తే ఆ రుణాల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతే, రైతులపై భారం తడిసి మోపెడు అవుతుందని, వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రుణాలను రీ షెడ్యూల్ చేస్తామంటే అందుకు రైతులు అంగీకరిస్తారా? అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నారుు.
గత ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్‌కు వినతి
ఇలా ఉండగా గత ఖరీఫ్‌లో ప్రకటించిన విధంగా కరువు మండలాల్లోని రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయలేదని, ఇప్పుడు నిబంధనలను సడలించి ఆ రుణాలను రీ షెడ్యూల్ చేయాల్సిందిగా ఆర్‌బీఐకి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరువు మండలాలను ప్రకటిస్తూ జీవో జారీ చేయడంలో జాప్యం జరిగినందున ఆయూ మండలాల్లోని రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయలేదు.
రుణాల రీషెడ్యూల్‌పై 30న నిర్ణయం!
Published Tue, Jun 24 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement