
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు.
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. రుణ మాఫీ అంశం రైతుల చేతిలో బాండ్లు పెట్టి, వారి చెవిలో పూలు పెట్టినవిధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏపిలో గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతోందన్నారు. గాంధీ జయంతి రోజున అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. మద్య నిషేదం అన్న వ్యక్తి ఇప్పుడు డోర్ డెలివరీ ఇస్తున్నారన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారో కేలండర్ విడుదల చేయాలని టిడిపి నేతలను డిమాండ్ చేశారు. కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన వద్దన్నారు. జన్మభూమి కార్యక్రమాలలో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారని ఉమ్మారెడ్డి హెచ్చరించారు.
**