
రాజకీయ పార్టీల ఆనాలోచిత పథకాలు
హైదరాబాద్: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి లేకుండా రైతుల రుణలమాఫీ ఎలా ప్రకటిస్తారని కెనరాబ్యాంక్ సీఎండీ ఆర్‌కే దూబే ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వారు ఇద్దరూ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా ఇంత వరకు రుణాలను మాఫీ చేయలేదు. ఈ రుణాలను మాఫీ చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. ఏపిలో అయితే జీతాలు ఇవ్వడానికే డబ్బు లేదు. ఇక రుణాలు ఏలా మాఫీ చేయాలో అర్ధంకాక చంద్రబాబుకు తల తిరుగుతోంది.
ఈ నేపధ్యంలో కెనరాబ్యాంక్ సీఎండీ దూబే మాట్లాడుతూ రాజకీయ పార్టీల అనాలోచిత పథకాలతో బ్యాంకింగ్ రంగానికి దెబ్బ తగులుతోందన్నారు. స్తోమత కలిగిన రైతు కూడా కట్టకపోవడంతో ఎన్‌పీఏ(నాన్ ప్రాఫిట్ అసెట్స్ లేక పేరుకుపోయిన బకాయిలు)లు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు.