లాభాల్లో ఉన్న సంస్థల తాకట్టు: మంత్రి ప్రత్తిపాటి | Hostage to the profits of companies: Minister prattipati | Sakshi
Sakshi News home page

లాభాల్లో ఉన్న సంస్థల తాకట్టు: మంత్రి ప్రత్తిపాటి

Published Sun, Jul 20 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

లాభాల్లో ఉన్న సంస్థల తాకట్టు: మంత్రి ప్రత్తిపాటి

లాభాల్లో ఉన్న సంస్థల తాకట్టు: మంత్రి ప్రత్తిపాటి

హైదరాబాద్: రైతు రుణాల మాఫీ కోసం లాభా ల్లో ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఆయన సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మం త్రి సునీత, గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో కలి సి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు కూడా వనరుల సమీకరణకు ఇదే పద్ధతిని అనుసరించాయన్నారు. లాభాల్లో ఉన్న ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్  వంటి సంస్థలను తాకట్టు పెడతామన్నారు. అలా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చెల్లించి తాకట్టు నుంచి సంస్థలను విడిపిస్తామని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఏం నిబంధనలకు అనుగుణంగానే తాకట్టు పెడతామని చెప్పారు. బాండ్లు జారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement