హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ? | ysrcp leaders blames on chandra babu govt | Sakshi
Sakshi News home page

హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ?

Published Thu, Oct 30 2014 1:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ? - Sakshi

హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ?

విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ఎద్దేవా
 
తిరుపతి: ‘‘ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయాల్సిన సీఎం చంద్రబా బు.. ఆ హామీలను మాఫీ చేస్తున్నారు. ఒక్క సంతకంతో రూ.87 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రైతు సాధికార సంస్థ ద్వారా ఐదు విడతల్లో రుణ విముక్తి కల్పిస్తామంటున్నారు. రూ. 15 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఆడపడుచుల ఓట్లను దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఒక్కో సంఘానికి ఐదు విడతల్లో రూ.లక్షను మూలధనంగా ఇస్తామంటున్నారు. ఇచ్చిన మాటపై నిలబడకపోవడం చంద్రబాబు నైజం.. ఐదు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందంటే చంద్రబాబు పనితీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. వాస్తవాలిలా ఉండ గా టీడీపీకి తాబేదారులుగా మారిన కొన్ని మీడి యా సంస్థలు చంద్రబాబు హామీలన్నీ అమలుచేస్తున్నట్లు కథనాలను ప్రచురించడం విడ్డూరం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తాం.. బాబు తీరును ఎండగడతాం’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షతన బుధవారం తిరుపతిలో పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలోనూ, ఆ తర్వాత విలేకరులో సమావేశంలోనూ వారిద్దరూ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 43 లక్షల వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లలో కోత వేస్తున్నారు. తెల్లకార్డుల లబ్ధిదారుల పొట్టకొట్టేందుకు కుట్ర లు చేస్తున్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తా.. లేదంటే నిరుద్యోగులకు నెలకు రూ.రెండు వేల చొప్పున భృతి ఇస్తానంటూ ఇచ్చిన హామీలు మరిచారు. కానీ ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవేం? చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్మును బినామీలతో పెట్టుబడి పెట్టించి సింగపూర్‌లో హోటల్ కట్టారు. ఆ హోటల్ విలువ ఇప్పు డు రూ.25 వేల కోట్లు ఉంటుంది. ఆ హోటల్ అమ్మి ఆ సొమ్మును రైతు సాధికార సంస్థలో డిపాజిట్ చేస్తే రుణ మాఫీ చేయొచ్చని మీడియా వారే చంద్రబాబుకు సలహా ఇవ్వండి. హామీలను అమలుచేయకపోవడం వల్ల టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది. ఆచరణ సాధ్యమైన హామీ లు మాత్రమే ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యం. వైఎస్సార్‌సీపీని వీడి వెళ్లేవారు.. పోతూ పోతూ ఏదో ఒక రాయి వేయాలనే వేస్తున్నారు తప్ప జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం లేదు’’అని అన్నారు.

వంచన అంటే చంద్రబాబే: ఉమ్మారెడ్డి

వంచనలో చంద్రబాబును మించిన వారు లేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement