ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఆయననే వెంటాడుతున్నాయి. ఆయన రగిల్చిన రిజర్వేషన్ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఏపీలో ఒక వైపు కాపులు ఉద్యమిస్తున్నారు. ఇంకోవెపు బీసీలు మండిపడుతున్నారు. దీనితో ఏపీలో టీడీపీ పునాదులు కదులుతున్నాయి. టీడీపీ స్థాపించిన ప్పటి నుంచి బీసీ కులాలు అండగా నిలిచాయి. కానీ ఇటీవలి కాలంలో టీడీపీ పార్టీ నేత బాబు తీసుకుం టున్న అసంబద్ధ నిర్ణయాల వలన ఈ కులాలు టీడీపీ పట్ల విశ్వాసం కోల్పోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణం బీసీలు, కాపులు. ఎన్నికలకు ముందు అనేక సర్వేలు కూడా వైఎస్సార్ సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తేల్చాయి. కానీ బీసీలు, కాపుల మద్దతుతో టీడీపీ అనూహ్యంగా గెలిచింది.
ఏపీలో ఇటీవలి కాలంలో టీడీపీ ప్రతిష్ట బాగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోవడమే. 1.45 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులంతా ఆగ్ర హంగా ఉన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అపహాస్యం పాలైంది. దీనితో రైతులు, మహి ళలలో భారీ వ్యతిరేకత వచ్చింది. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో టీడీపీకి పడ్డ అవినీతి ముద్ర చెరిగిపోనిది. శాసనసభ్యులకు కోట్ల రూపాయల డబ్బు లిచ్చి, కాంట్రాక్టులిచ్చి కొనుగోలు చేయడంతో పార్టీ ప్రతిష్ట బాగా దిగజారింది. దీనికితోడు తమను చిన్న చూపు, నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన బీసీలలో రగులు తోంది. ఇవన్నీ టీడీపీని బలహీనపర్చాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని సర్వేలు తెలుపుతున్నాయి. అదే సమ యంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆ పార్టీ 120 సీట్లు గెలుస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా. బీసీలు పార్టీ పెడితే టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్సార్‌సీపీకి దళితులు, ముస్లింలు, క్రిష్టియన్లు, రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా చెక్కు చెదరకుండా ఉంది.
అలాగే ఇతర వర్గాల ఓటుబ్యాంకు ఏ మాత్రం కలిసొచ్చినా ఆ పార్టీకి తిరుగుండదు. పైగా పార్టీ అధి నేత జగన్‌మోహన్ రెడ్డికి తండ్రిలాగా మాట తప్పని వాడు అనే విశ్వసనీయత ఉంది. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలడంతో రెండు రాష్ట్రాలలో కోలుకోలేని దెబ్బతినబోతోంది. ఏదేమైనా బీసీలు, కాపుల సమస్యలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.
- ప్రొ॥ఎం. బాగయ్య
వ్యాసకర్త ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మొబైల్ : 98665 30295
కదులుతున్న తెలుగుదేశం పునాదులు
Published Wed, Jul 13 2016 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement