
టీడీపీది దారుణ మోసం
పంట రుణాలను మాఫీచేయడంలో రెతులను టీడీపీ సర్కారు దారుణంగా మోసగించింది.. డ్వాక్రా రుణమాఫీ బదులు మ్యాచింగ్ గ్రాంటు ఇస్తామన్నారయి..
రాజాం: పంట రుణాలను మాఫీచేయడంలో రెతులను టీడీపీ సర్కారు దారుణంగా మోసగించింది.. డ్వాక్రా రుణమాఫీ బదులు మ్యాచింగ్ గ్రాంటు ఇస్తామన్నారయి.. దానికి అతీగతీ లేదు.. ఆయి నెలల్లోనే టీడీపీ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది’ అంటూ రాజాం ఎమ్మెల్యే క ంబాల జోగులు ధ్వజమెత్త్తాయి. టీడీపీ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలను నిర సిస్తూ వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున పోరాటం చేసేందుకు వెనుకాడేది లేదన్నా రు. రాజాంలోని తన కార్యాలయంలో బుధవార ం ఏర్పా టు చేసిన ముఖ్య కార్యకర ్తల సమావేశంలో మాట్లాడా రు. హుద్‌హుద్ తుపానుతో నష్టపోయి తాంగానికి ఇప్పటివర కూ పరిహారం పంపిణీపై స్పష్టతలేదన్నారు.
దోమపోటుతో నష్టపోయి వరి పంట గ ణన చేపట్టలేద ని, దీంతో ైరె తాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో టీడీపీ నేతల కనిపిస్తోందని, నిబంధనలు పక్కనపెట్టి చేస్తున్న బదిలీ లతో ఇటు ప్రజలు, అటు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇసుక రీచ్‌లను టీడీపీ అనుయాయులకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. నాయకులు ఉత తరావల్లి సురేష్‌ముఖర్జీ, కర ణం సుదర్శనరావు, జెడ్పీటీసీ సభ్యుడు టంకాల పాపినాయుడు, వంజరాపు విజయ్‌కుమార్, వావిలపల్లి ర మణనాయుడు, కోట రామయ్య, ఆల్తి రామయ్య, యారాడ వె ంకటేష్, కుప్పిలి చంద్రయ్య, లెంక నారాయణరావు, కార్తీక మల్లేశ్వరరావు, వావిలపల్లి భుజంగరావు, గండ్రెడ్డి భుజంగరావు, బండి నర సింహులు పాల్గొన్నారు.
రేపు పార్టీ సమావేశం
శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరి యంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థార ుు సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర నేతలు విజయసాయిరెడ్డి, ఆర్‌కే రోజా, ధర్మాన కృష్ణదాస్, వంగవీటి రాధా హాజరవుతారన్నారు.