అప్పుడిచ్చాం.. ఇప్పుడివ్వలేం | Insurance Corporation concluded to Chandrababu Naidu's government on loan waiver | Sakshi
Sakshi News home page

అప్పుడిచ్చాం.. ఇప్పుడివ్వలేం

Published Sat, Oct 25 2014 1:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అప్పుడిచ్చాం.. ఇప్పుడివ్వలేం - Sakshi

అప్పుడిచ్చాం.. ఇప్పుడివ్వలేం

రుణ మాఫీపై రైతులను మభ్య పెడుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పంటల బీమా విషయంలో చుక్కెదురరుు్యంది.

చంద్రబాబు సర్కారుకు తేల్చిచెప్పిన బీమా కార్పొరేషన్
ఖరీఫ్ ముగిశాక ఎలా కుదురుతుందని ప్రశ్న
సెప్టెంబర్ 15 వరకు పొడిగించినా వినియోగించుకోలేదని విమర్శ
ఒక్క ఉత్తరాంధ్రలోనే 4 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
రైతులకు బీమా పరిహారం హుళక్కే

 
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రుణ మాఫీపై రైతులను మభ్య పెడుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పంటల బీమా విషయంలో చుక్కెదురరుు్యంది. రుణ మాఫీ చేస్తామని, రైతుల బీమాకు ఢోకా లేదంటూ పదేపదే చెబుతూ చంద్రబాబునాయుడు చేస్తున్నది ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం కాదని తేలిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న రైతులకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపానుకు నష్టపోరుున రైతులకు బీమా లభించక కోలుకోలేని దెబ్బ తగులుతోంది. రైతుల పంటల బీమాకు ఏమీ ఢోకా లేదు, అక్టోబర్ నెలాఖరు వరకు పంటల బీమా గడువు పొడిగింప చేయడంతో పాటు కొత్త రుణాలు మంజూరు చేయిస్తామని నిన్నటివరకు సీఎం చంద్రబాబు మొదలుకుని ప్రభుత్వంలోని ఇతర పెద్దలు, టీడీపీ నేతలు ఊదరగొట్టారు.
 
 గత నెలాఖరున జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఖరీఫ్ పంటల బీమా గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించాలనే తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ పంటల బీమా కార్పొరేషన్‌కు పంపించారు. ప్రభుత్వం చెప్పిన అక్టోబర్ నెలాఖరు ముగియడానికి ఇక వారం రోజుల మాత్రమే గడువు ఉంది. ఇంతలోనే వ్యవసాయ బీమా కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానమిచ్చింది. బీమా కోసం గడువు పొడిగింపు సాధ్యం కాదంటూ లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్‌ఎల్‌బీసీకి తెలియజేసింది. రాష్ర్ట ప్రభుత్వ కోరిక మేరకు ఇప్పటికే సెప్టెంబర్ 15వ తేదీ వరకు పంటల బీమా గడువును పొడిగించామని, అయినా సరే ఆ గడువును వినియోగించుకోలేకపోయూరని పేర్కొంది.
 
  ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత మరోసారి గడువు పొడిగింపు సాధ్యం కాదని ఆ లేఖలో తేల్చిచెప్పింది. ఖరీఫ్‌లో పంటల బీమా గడువు పొడిగింపు జరగకపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కరువుబారిన పడిన, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుదూద్ తుపాను కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయిన వారికి పరిహారం లభించే పరిస్థితి లేకుండా పోరుుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు ఐదు లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారని ఎస్‌ఎల్‌బీసీ అంచనా వేసింది. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందనే నమ్మకంతో రైతులు పాత రుణాలను తిరిగి చెల్లించలేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలను మంజూరు చేయలేదు. దీంతో పంటల బీమా ప్రీమియంను కూడా రైతులు కట్టలేదు. నేరుగా రుణమాఫీ చేయకుండా నానా రకాలుగా నాన్చుతున్న ప్రభుత్వం పంటల బీమా గడువును పొడిగింపజేస్తామని తద్వారా రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూస్తామనే ప్రచారానికి దిగింది. తాజాగా బీమా కార్పొరేషన్ గడువు పొడిగింపు సాధ్యం కాదని చెప్పడంతో.. ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న రైతులకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపానుకు నష్టపోరుున రైతులకు బీమా లభించని పరిస్థితి తలెత్తింది.
 
 ఒక్క ఎకరాకూ  బీమా దక్కని పరిస్థితి
 హుదూద్ తుపాను ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగాన్ని కుదిపేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,68,487 హెక్టార్లలో (4 లక్షలకు పైగా ఎకరాలు) కోట్లాది రూపాయల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. 1,14,793 హెక్టార్లలో వరి, 34,152 హెక్టార్లలో చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు సాధారణంగా ఏటా పంటలకు బీమా చేయిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులకు ప్రమాదం వాటిల్లినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తనప్పుడు, వడగండ్ల వానలు కురిసినప్పుడు జరిగే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఈ ఆశతోనే రైతులు ఏటా బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు.
 
ఉచిత విద్యుత్‌కు ఎసరు!
ఆదాయంతో లింకు పెట్టే యోచనలో ఏపీ సర్కారు
లక్షలాది రైతులపై పెనుభారం

 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ విద్యుత్‌కు ఆదాయ పరిమితి లింకు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యవసాయ కనెక్షన్‌ను బ్యాంకుల్లో, ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు సమాచారం. విద్యుత్ పంపిణీ నష్టాలున్న చోట్ల ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వీలైనంత త్వరగా మిగతా అన్ని ప్రాంతాల్లో దీన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. ఫీడర్ స్థాయిలో సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని 13.5 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ లబ్దిదారుల్లో అనేక లక్షల మంది ఈ పథకానికి దూరమవుతారు. వీరంతా వాడిన ప్రతి యూనిట్‌కు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  
 
 రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఒప్పందాల రోజే.. ఈ దిశగా ఆలోచన మొదలైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభా ముఖంగానే దీన్ని చూచాయగా ప్రస్తావించారు. ప్రతీ విద్యుత్ వినియోగదారుడికీ బ్యాంక్ ఖాతా ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ముందుగా వ్యవసాయ కనెక్షన్లపై విద్యుత్ శాఖ దృష్టి పెట్టింది. విద్యుత్ పంపిణీకి సంబంధించిన నష్టాలన్నిటినీ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ ఖాతాలోనే చూపిస్తూ వస్తోంది. కాబట్టి ఈ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను తగ్గించాలనే నిర్ణయానికొచ్చారు. ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. రైతుకు ఇచ్చే రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాకే జమ చేయాలనేది తమ యోచనగా పైకి చెబుతోంది. ఉచిత విద్యుత్ లబ్దిదారులను వీలైనంతగా తగ్గించడమే సర్కారు అసలు లక్ష్యమని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఇందుకనుగుణంగానే ఈ నెలాఖరుకల్లా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement