AP: వ్యవసాయం పండగ | Sakshi
Sakshi News home page

వ్యవసాయం పండగ

Published Fri, May 10 2024 6:00 AM

Agriculture sector progress in ap

సర్కారు వ్యవ‘సాయం’ రూ. 1,86,548 కోట్లు

»  రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయ రంగం 
»    గణనీయమైన పురోగతి.. రైతుల ఆదాయం పెరుగుదల.. జీవన ప్రమాణ స్థాయి మెరుగు  
»    వినూత్న ఆర్బీకే వ్యవçస్థపై అంతర్జాతీయ స్థాయిలో వేనోళ్లా ప్రశంసలు 
»   గ్రామ స్థాయిలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, యంత్ర, బ్యాంకింగ్‌ సేవలు 
»    ఈ క్రాప్‌ ద్వారా పక్కాగా పంటల నమోదు  
»    పైసా భారం పడకుండా పంటల బీమా 
»    సీజన్‌ ముగియకుండానే పంట నష్టపరిహారం 
»    గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు సైతం చెల్లింపు 
»    ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల సాయం 
»   రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం.. దిగుబడులు.. 
»   పండ్ల సాగు, దిగుబడులు, ఎగుమతులు ఘనం 
»   ఆక్వా రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం 

బాబు దండగ అంటే.. జగన్‌ పండగ చేశారు.. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో !విప్లవాత్మక మార్పులు 
చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు నిండా మునిగారు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. 

Advertisement
 
Advertisement