షరతుల్లేకుండా రైతుల రుణమాఫీ చేయాలి | no Conditions Farmers loan waived | Sakshi
Sakshi News home page

షరతుల్లేకుండా రైతుల రుణమాఫీ చేయాలి

Published Fri, Jun 6 2014 1:05 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

షరతుల్లేకుండా రైతుల రుణమాఫీ చేయాలి - Sakshi

షరతుల్లేకుండా రైతుల రుణమాఫీ చేయాలి

కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : షరతులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆయన గురువారం రాజ మండ్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం రైతుల రుణ మాఫీపై పెట్టాలని కోరారు. షరతులతో కూడిన రైతు రుణ మాఫీ జరుగుతుందంటూ ఆపార్టీకి చెందిన పత్రికలో వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తాను మాట్లాడుతున్నానని అన్నారు.
 
 రుణాల హామీ కాగితాలకే పరిమితం చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. రైతుల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే తాము ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో రాజ్యాంగ బద్ధంగా జరిగేలా లేదని నెహ్రూ పేర్కొన్నారు. అది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమంలా ఉందన్నారు. తమకు ఇంతవరకూ ఆహ్వానం ఏదీ అందలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రాజ్యాంగ బద్ధంగా జరిగేలా ఉంటే, తమకు ఆహ్వానం అందితే వెళ్లేదీ లే నిదీ ఆలోచిస్తామని నెహ్రూ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement