mla jyothula nehru
-
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. -
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పీఎస్‌లో దళితుల ఫిర్యాదు
-
చంద్రబాబు తీరు విడ్డూరం
‘రేవంత్’ ఎపిసోడ్ తరువాత కూడా నిజాయితీ గురించి మాటలా? వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ సమరదీక్ష విజయవంతం చేయాలని పిలుపు రాజమండ్రి : విజయవాడ నవనిర్మాణ దీక్షలో అవినీతి లేని ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామంటూ ప్రజలచేత ముఖ్యమంత్రి ప్రమాణం చేయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం వెలుగు చూసిన తరువాత కూడా బాబు నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ‘ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి, అభివృద్ధి చేయాల్సింది పోయి, నవనిర్మాణ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ దాడిలో పట్టుబడిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. విజయవాడలో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రబాబు నవనిర్మాణ దీక్షకు దిగారన్నారు. అధికారంలో ఉన్నవారు దీక్షలు చేయరని, వారికి కనువిప్పు కలిగించేందుకు ప్రతిపక్షాలు మాత్రమే దీక్షలు చేస్తాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటూ ఏకపక్షంగా పాలిస్తున్న చంద్రబాబు అభివృద్ధి చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరూ లేరని, అభివృద్ధి ముసుగులో పట్టిసీమ ఎత్తిపోతల పథకం, రాజధానిని ప్రైవేట్‌పరం చేస్తే మాత్రం పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో చంద్రబాబు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో బుధ, గురువారాల్లో సమరదీక్ష చేస్తున్నారని జ్యోతుల వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనువిప్పు కలిగిస్తారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, నక్కా రాజబాబు, సంయుక్త కార్యదర్శి దంగేటి రాంబాబు, పార్టీ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల వెంకట స్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మజ్జి నూకరత్నం, నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, లంకా సత్యనారాయణ, మోటూరి సాయి, భద్రి బాబ్జీ పాల్గొన్నారు. -
షరతుల్లేకుండా రైతుల రుణమాఫీ చేయాలి
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : షరతులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆయన గురువారం రాజ మండ్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం రైతుల రుణ మాఫీపై పెట్టాలని కోరారు. షరతులతో కూడిన రైతు రుణ మాఫీ జరుగుతుందంటూ ఆపార్టీకి చెందిన పత్రికలో వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. రుణాల హామీ కాగితాలకే పరిమితం చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. రైతుల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే తాము ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో రాజ్యాంగ బద్ధంగా జరిగేలా లేదని నెహ్రూ పేర్కొన్నారు. అది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమంలా ఉందన్నారు. తమకు ఇంతవరకూ ఆహ్వానం ఏదీ అందలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రాజ్యాంగ బద్ధంగా జరిగేలా ఉంటే, తమకు ఆహ్వానం అందితే వెళ్లేదీ లే నిదీ ఆలోచిస్తామని నెహ్రూ తెలిపారు.