హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క హామీ అయినా అమలు చేసారా ? అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శివకుమార్ సూటిగా ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడమే బంగారు తెలంగాణా? అంటూ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మే 2న తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ మాత్రమేనని శివకుమార్ చెప్పారు.
'రైతుల ఆత్మహత్యలే బంగారు తెలంగాణా?'
Published Mon, Apr 27 2015 3:15 PM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement