గందరగోళంగా మారిన రుణమాఫీ పథకం : ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ పథకం గందరగోళంగా మారిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని పెంచి రైతు రుణాలను ఒకే దశలో చెల్లిస్తామన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఉత్తమ్ సూచించారు. ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కరువు నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు.