సంతలో పశువులను కొన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
హైదరాబాద్: సంతలో పశువులను కొన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కోట్ల రూపాయలను గుమ్మరిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఉన్నవాళ్లే చట్టసభలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వెంటనే రైతులకు రుణాలు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.