
వడపోత తర్వాతే రుణమాఫీ
రైతు రుణాల మాఫీకి వడపోత విధానం అవలంబించాలని కోటయ్య కమిటీ సూచించింది. కాకుండా బోగస్ అఫిడవిట్‌లు ఇచ్చి న రైతులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంది.
ఏపీ సర్కారుకు కోటయ్య కమిటీ నివేదిక
బోగస్ అఫిడవిట్ ఇస్తే 18 శాతం వడ్డీతో రికవరీకి సూచన
హైదరాబాద్: రైతు రుణాల మాఫీకి వడపోత విధానం అవలంబించాలని కోటయ్య కమిటీ సూచించింది. కాకుండా బోగస్ అఫిడవిట్‌లు ఇచ్చి న రైతులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంది. వ్యవసాయ, మహిళా సంఘాల రుణాల మాఫీపై కోటయ్య కమిటీ సోమవారం 67 పేజీలతో కూడిన తుది నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్పించింది. ఆ నివేదికలో ఆర్‌బీఐతో జరిపిన చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయా రంగాల రుణాలు, నిధుల సమీకరణ, రుణ మాఫీకి అర్హులు, అనర్హులు, దరఖాస్తు వంటి అంశాలను పేర్కొంది. మొత్తం వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.87,612.25 కోట్లు ఉన్నట్లు నివేది కలో పేర్కొన్నారు. ఇందులో పంట, బంగారం రుణాలు రూ.60,659.44 కోట్లు ఉన్నాయి. 7,72,412 మహిళా సంఘాల పేరు మీద మార్చి నెలాఖరు నాటికి రూ.13,764 కోట్ల రుణాలున్నాయి. లక్ష రూపాయల వరకు మహిళా సంఘాల రుణమాఫీని వర్తింప చేస్తే రూ.7,724 కోట్లు అవుతుంది. షరతులు విధిం చడం ద్వారా మొత్తం రుణ మాఫీని రూ.33 వేల కోట్లకు పరిమితం చేయాలని కోటయ్య కమిటీ పేర్కొంది. చేనేత రూ.168 కోట్లను, గొర్రెలు, మేకలు, పందుల కోసం తీసుకున్న రుణాలకు రుణ మాఫీ వర్తింప చేయాలని కోటయ్య కమిటీ సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
పంట రుణాలు, బంగారం రుణాలు, పంట తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, రైతు మిత్ర గ్రూపులు, సంయుక్త రైతుల రుణాలకు, కిసాన్ క్రెడిట్ దారుల రుణాలకు. స్వల్ప కాలిక రుణాలను మధ్యకాలిక రుణంగా మార్చిన రుణాలకు రుణ మాఫీ వర్తింపు.కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ అమలు. కుటుంబంలో ఎంతమంది రుణాలు ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నా రుణ పరిమితికి లోబడి మాత్రమే రుణ మాఫీ వర్తింపు.
కుటుంబం అంటే భార్యా, భర్త, మైనర్ పిల్లలు. ఏ రుణం అయినా రుణ పరిమితికి మించి ఆ కుటుంబంలో జరగదు.ఈ ఏడాది మార్చి వరకు ఉన్న రుణాలకు సంబంధించి ప్రతీ కుటుంబం దరఖాస్తుతోపాటు ఆయా కుటుంబసభ్యుల పేరిట ఎంత రుణం ఉందో అఫిడవిట్‌ను సమర్పించాలి. తప్పుడు అఫిడవిట్ ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. 18 శాతం వడ్డీతో తిరిగి రాబట్టాలి.బ్యాంకు ఖాతాలకు రైతు ఆధార్, పాసుపుస్తకం నంబర్ల అనుసంధానం