రైతులకు రూ. 805 కోట్ల రుణాలు
సంతకవిటి : గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ద్వారా శ్రీకాకుళం రీజనల్ పరిధిలో రూ. 805 కోట్లు రుణాలను రైతులకు అందజేశామని ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ బీఎస్‌ఎన్ రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బ్రాంచి కొత్త కార్యాలయూన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.రైతు రుణ మాఫీకి సంబంధించి స్పష్టత లేనప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు రుణాలు పొందిన రైతులు ఆధార్‌కార్డులను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేస్తున్నామన్నారు. బ్యాంకు రీజనల పరిధిలో పది కొత్తశాఖలు ప్రారంభించనున్నామన్నారు.
డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలన్నారు. ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అరుుతే తీసుకున్న రుణాన్ని మాఫీ కోసం ఎదురు చూడకుండా సక్రమంగా వారుుదాలు చెల్లించాలన్నారు. అనంతరం ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన మేనేజర్ శర్మను ఆర్‌ఎం సన్మానించారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ, ఫీల్డ్ ఆఫీసర్ హనుమంతరావు, క్యాషియర్ ప్రకాశరావు పాల్గొన్నారు.