స్వచ్ఛభారత్‌లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఫస్ట్
స్వచ్ఛభారత్‌లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఫస్ట్
Published Wed, Aug 3 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నెల్లూరు(సెంట్రల్)
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైల్వే స్టేషన్లలో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు స్వఛ్చ భారత్‌లో ప్రథమ స్థానం లభించింది. విజయవాడ నుంచి తడ వరకు ఉన్న మొత్తం రైల్వే స్టేషన్లను కొన్ని నెలల క్రితం కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఆథోని జయరాజ్ మాట్లాడుతూ దేశంలో 407 ప్రధాన రైల్వే స్టేషన్‌లను ఎంపిక చేశారన్నారు. బృందం పరిశీలించిన అనంతరం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ 28వ స్టేషన్‌గా నిలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. స్టేషన్లలో సౌకర్యాల కల్పనలోతో పాటు ప్రయాణికులకు ఇచ్చే అన్ని సౌకర్యాలపై పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపారు. అందులో కేంద్రం పరిశీలించి నెల్లూరును ఏపీలో నంబర్–1 స్టేషన్‌గా పేర్కొనిందన్నారు.
Advertisement
Advertisement