ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్
రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్‌ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది.
ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్
2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది.
రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి
గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది.
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
Published Mon, Dec 18 2023 5:52 AM | Last Updated on Mon, Dec 18 2023 9:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment