న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. అంతర్జాతీయ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్ .. 2023కి గాను రూపొందించిన 50 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టీసీఎస్ బ్రాండ్ విలువ రూ. 1.09 లక్షల కోట్లుగా ఉండగా, రిలయన్స్ రూ. 65,320 కోట్లుగా, ఇన్ఫోసిస్‌ది రూ. 53,323 కోట్లుగాను ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ 4వ స్థానంలో, రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన టెలికం, డిజిటల్ విభాగం జియో రూ. 49,027 కోట్ల బ్రాండ్ విలువతో టాప్ 5లో నిల్చాయి. తొలి 10 బ్రాండ్స్ మొత్తం విలువలో టాప్ 3 బ్రాండ్స్ వాటా ఏకంగా 46%గా ఉన్నట్లు ఇంటర్‌బ్రాండ్ తెలిపింది. ర్యాంకింగ్స్ నివేదికకు సంబంధించి వివరాలు..
► ఎయిర్‌టెల్, ఎల్‌ఐసీ, మహీంద్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ టాప్ 10 బ్రాండ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.
► లిస్టులోని మొత్తం కంపెనీల విలువ రూ. 8.3 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) పైగా ఉంది. ఇది 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే ప్రథమం.
► మూడు టెక్నాలజీ బ్రాండ్‌లు టాప్ 5లో చోటు దక్కించుకోవడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి.
► గత పదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ విభాగం అత్యధికంగా 25 శాతం, గృహ నిర్మాణం.. ఇన్‌ఫ్రా 17 శాతం, టెక్నాలజీ 14 శాతం వృద్ధి చెందాయి.
► టాప్ 10 బ్రాండ్‌ల విలువ రూ. 4.9 లక్షల కో ట్లుగా ఉండగా.. జాబితాలోని మిగతా 40 బ్రాండ్‌ల విలువ రూ. 3.3 లక్షల కోట్లు.
► ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా తొమ్మిది సంస్థలు ఉండగా .. గృహ నిర్మాణం.. ఇన్‌ఫ్రా రంగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ విభాగం నుంచి ఏడు సంస్థలు చోటు
దక్కించుకున్నాయి.
అత్యంత విలువైన బ్రాండ్స్‌లో టీసీఎస్ టాప్..
Published Fri, Jun 2 2023 4:27 AM | Last Updated on Fri, Jun 23 2023 6:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment