valuable brands
-
భారత్‌లో విలువైన టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.భారతదేశంలో కూడా బిలినీయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న.. విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ గ్రూప్ వంటివి ఉన్నాయి.లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక.. 2025లో టాప్ 10 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను వెల్లడించింది.➤టాటా గ్రూప్: 31.6 బిలియన్ డాలర్లు➤ఇన్ఫోసిస్: 16.3 బిలియన్ డాలర్లు➤హెచ్డీఎఫ్సీ గ్రూప్: 14.2 బిలియన్ డాలర్లు➤ఎల్ఐసీ: 13.3 బిలియన్ డాలర్లు➤రిలయన్స్ గ్రూప్: 9.8 బిలియన్ డాలర్లు➤ఎస్బీఐ గ్రూప్: 9.6 బిలియన్ డాలర్లు➤హెచ్‌సీఎల్‌టెక్: 8.9 బిలియన్ డాలర్లు➤ఎయిర్టెల్: 7.7 బిలియన్ డాలర్లు➤లార్సెన్ & టూబ్రో: 7.4 బిలియన్ డాలర్లు➤మహీంద్రా గ్రూప్: 7.2 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
అత్యంత విలువైన బ్రాండ్స్‌లో టీసీఎస్ టాప్..
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. అంతర్జాతీయ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్ .. 2023కి గాను రూపొందించిన 50 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టీసీఎస్ బ్రాండ్ విలువ రూ. 1.09 లక్షల కోట్లుగా ఉండగా, రిలయన్స్ రూ. 65,320 కోట్లుగా, ఇన్ఫోసిస్‌ది రూ. 53,323 కోట్లుగాను ఉంది. హెచ్డీఎఫ్సీ 4వ స్థానంలో, రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన టెలికం, డిజిటల్ విభాగం జియో రూ. 49,027 కోట్ల బ్రాండ్ విలువతో టాప్ 5లో నిల్చాయి. తొలి 10 బ్రాండ్స్ మొత్తం విలువలో టాప్ 3 బ్రాండ్స్ వాటా ఏకంగా 46%గా ఉన్నట్లు ఇంటర్‌బ్రాండ్ తెలిపింది. ర్యాంకింగ్స్ నివేదికకు సంబంధించి వివరాలు.. ► ఎయిర్టెల్, ఎల్ఐసీ, మహీంద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ టాప్ 10 బ్రాండ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ► లిస్టులోని మొత్తం కంపెనీల విలువ రూ. 8.3 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) పైగా ఉంది. ఇది 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే ప్రథమం. ► మూడు టెక్నాలజీ బ్రాండ్లు టాప్ 5లో చోటు దక్కించుకోవడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. ► గత పదేళ్లలో ఎఫ్ఎంసీజీ విభాగం అత్యధికంగా 25 శాతం, గృహ నిర్మాణం.. ఇన్ఫ్రా 17 శాతం, టెక్నాలజీ 14 శాతం వృద్ధి చెందాయి. ► టాప్ 10 బ్రాండ్ల విలువ రూ. 4.9 లక్షల కో ట్లుగా ఉండగా.. జాబితాలోని మిగతా 40 బ్రాండ్ల విలువ రూ. 3.3 లక్షల కోట్లు. ► ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా తొమ్మిది సంస్థలు ఉండగా .. గృహ నిర్మాణం.. ఇన్ఫ్రా రంగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ విభాగం నుంచి ఏడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. -
అత్యంత ఖరీదైన బ్రాండ్లు ఏంటో తెలుసా..?
టెక్ దిగ్గజం యాపిల్ ను అధిగమించి, ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా సెర్చ్ ఇంజన్ గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ మిల్వార్ట్ బ్రౌన్ వార్షిక ర్యాంకింగ్స్ లో గూగుల్ తన హవా చాటుకుంది. 30లక్షల కన్సూమర్ల ఇంటర్వ్యూలు, ప్రతీ కంపెనీ ఫైనాన్సియల్ డేటా, బిజినెస్ ఫర్ ఫార్మెన్స్ తో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ ల ర్యాంకింగ్ లను మిల్వార్డ్ బ్రౌన్ వెల్లడించింది. ఈ బ్రాండింగ్ సంస్థ విడుదల చేసిన ర్యాకింగ్ లో టాప్-5 లో నిలిచిన కంపెనీల గురించి మనం ఓ సారి తెలుసుకుందాం... 1. గూగుల్.... బ్రాండ్ విలువ : 22,920 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +32శాతం గతేడాది ర్యాంకు : 2 కొంగొత్త ఆవిష్కరణలతో గూగుల్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అధిక మొత్తంలో వ్యాపార ప్రకటనలతో తన రాబడులను పెంచుకుంది. క్లౌడ్ బిజినెస్ లో తన వృద్ది ఎక్కువగా ఉందని, పనిలో చాలా పారదర్శకతగా గూగుల్ వ్యవహరిస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ చెప్పింది. 2. యాపిల్.... బ్రాండ్ విలువ : 22,850 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : -8శాతం గతేడాది ర్యాంకు : 1 యాపిల్ ఈ ఏడాది ఆవిష్కరించిన కొత్త ప్రొడక్ట్ ల ఫర్ ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రాండ్ విలువకు దెబ్బకొట్టింది. యాపిల్ వాచ్ ను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. కానీ అది అంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రత్యర్థి కంపెనీ స్మార్ట్ ఫోన్ల కంపెనీల కంటే యాపిల్ స్మార్ట్ వాచ్ అమ్మకాలే ఎక్కువ నమోదు అయ్యాయి. కేవలం గాడ్జెట్ లు మాత్రమే కాక, తాను సర్వీసులను కూడా అందించగలదని, చైనాలో అతిపెద్ద రవాణా సంస్థ దిదీ చుక్సింగ్ లో పెట్టుబడులు పెట్టి నిరూపించింది. 3.మైక్రోసాప్ట్.... బ్రాండ్ విలువ : 12,180 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +5శాతం గతేడాది ర్యాంకు : 3 బిజినెస్ టూ బిజినెస్ బ్రాండ్ లో మైక్రోసాప్ట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. కమర్షియల్ క్లౌడ్ బిజినెస్ లో మైక్రోసాప్ట్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2700లక్షల డివైజ్ లలో విండోస్ 10 యాక్టివ్ లో ఉంది. 4. ఏటీ అండ్ టీ... బ్రాండ్ విలువ.. 10,740 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +20శాతం గతేడాది ర్యాంకు : 6 టాప్-10 నిలిచిన ఈ కంపెనీ, రెండో టెలికాం కంపెనీగా పేరుతెచ్చుకుంటోంది. క్వాడ్ ప్లే వల్ల ఏటీ అండ్ టీ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఫర్ ఫార్మ్ చేస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ తెలిపింది. ఏటీ అండ్ టీ కారు తయారీ దారులు ఫోర్డ్, బీఎమ్ డబ్ల్యూ, టెస్లాలతో దోస్తి కుదుర్చుకుని, అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. 5. ఫేస్ బుక్... బ్రాండ్ విలువ : 10,260 కోట్ల డాలర్లు గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +44 శాతం గతేడాది ర్యాంకు : 12 ఫేస్ బుక్ 2015 ఏడాదిలో రెవెన్యూల్లో దూసుకెళ్లి, బలమైన ఆర్థిక ప్రదర్శనను చూపిండటంతో, తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగింది. వర్చువల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తూ లాంగ్ టర్మ్ విజన్ ఏర్పాటుచేసుకుంది. మీడియా ప్లాట్ ఫామ్ లోకి తన వర్క్ ను మరల్చుకుంటూ, ఒరిజినల్ కంటెంట్ ను పబ్లిషర్లు ఫేస్ బుక్ పై పోస్టు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఎక్కువగా వీడియోల ద్వారా వార్తల వారధిగా నిలుస్తోంది.