
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.
భారతదేశంలో కూడా బిలినీయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న.. విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ వంటివి ఉన్నాయి.
లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక.. 2025లో టాప్ 10 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను వెల్లడించింది.
➤టాటా గ్రూప్: 31.6 బిలియన్ డాలర్లు
➤ఇన్ఫోసిస్: 16.3 బిలియన్ డాలర్లు
➤హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్: 14.2 బిలియన్ డాలర్లు
➤ఎల్‌ఐసీ: 13.3 బిలియన్ డాలర్లు
➤రిలయన్స్ గ్రూప్: 9.8 బిలియన్ డాలర్లు
➤ఎస్‌బీఐ గ్రూప్: 9.6 బిలియన్ డాలర్లు
➤హెచ్‌సీఎల్‌టెక్: 8.9 బిలియన్ డాలర్లు
➤ఎయిర్‌టెల్: 7.7 బిలియన్ డాలర్లు
➤లార్సెన్ & టూబ్రో: 7.4 బిలియన్ డాలర్లు
➤మహీంద్రా గ్రూప్: 7.2 బిలియన్ డాలర్లు
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా
Comments
Please login to add a commentAdd a comment