ఆదాయ వృద్ధిలో బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ టాప్
Published Thu, Apr 7 2016 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
విశాఖపట్నం : ఆదాయ వృద్ధిలో దేశంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్(రెండు తెలుగు రాష్ట్రాలు) నంబర్ వన్ స్థానంలో ఉందని ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ మురళీధర్ తెలిపారు. విశాఖలోని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో 8 శాతం వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు.
దేశంలోనే ఏపీ టెలికాం నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. సెల్యూలర్ విభాగంలో 10 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో 5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. రూ.160 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 17 లక్షల కనెక్షన్లతో మంచి రెవెన్యూ సాధించగలిగామని చెప్పారు. డేటా విషయానికొస్తే ఐదు శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది చివరికి 4జీ సేవల్లో అడుగుపెట్టనున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్‌వర్క్ విస్తరించనున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement