- రాష్ట్రంలో ద్వితీయస్థానం
‘డిజిటల్ బోధన’ లో గొల్లప్రోలు ప్రథమ స్థానం
Published Fri, Mar 10 2017 10:46 PM | Last Updated on Fri, Sep 28 2018 3:58 PM
గొల్లప్రోలు :
జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోధనలో గొల్లప్రోలు జెడ్పీ బాలుర పాఠశాల రాష్ట్రంలో ద్వితీయస్థానం, ల్లాలో ప్రథమ స్థానం సాధించింది. జిల్లా వ్యాప్తంగా గత నవంబర్‌లో వందపాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సులభమైన, ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధన చేయడానికి డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా గొల్లప్రోలు జెడ్పీసూ్కల్ 188 గంటల పాటు డిజిటల్ క్లాసులు నిర్వహించినట్టు జిల్లావిద్యాశాఖ వెలువడించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరగున్నమాపురం ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లాలో కరప హైసూ్కల్ ద్వితీయస్థానంలో నిలిచింది. ఈమేరకు పాఠశాలలో డిజిటల్ క్లాసుల నిర్వహణకు కృషి చేసిన ఇ¯ŒSచార్జి జే.కామేశ్వరరావును, ప్రధానోపాధ్యాయులు జీఏ ప్రశాంతిని పలువురు అభినందించారు.
Advertisement