Digital classes
-
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్!
ఢిల్లీ, సాక్షి: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోంది. రిపబ్లిక్ డే కోసం శకటాల ఎంపికలో వైవిధ్యతను కనబర్చింది. రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్లే.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ శకటం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు సిద్ధమైంది. దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను అందించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్యానికి తగ్గట్లుగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం.. అదీ ఏపీ తరఫున తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేయబోతోంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా కనువిందు చేయనుంది జగనన్న విజన్‌ను ప్రతిబింబించే ఏపీ శకటం. -
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు అమ్మ.. ఆవు అనే పదాల దగ్గరే ఆగిపోవాలి గాని.. ఇంగ్లిష్ నేర్చుకోవడమేంటి? ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు చిరిగిన సంచీలో నాలుగు పుస్తకాలు పట్టుకుపోవాలే తప్ప.. కార్పొరేట్ పిల్లల్లా టై కట్టుకుని, బూట్లు వేసుకుని బడికి వెళ్లడమేంటి? మాలాంటి పెద్దల ఇంట్లో పిల్లలు వాడే ట్యాబ్‌లు.. డిజిటల్ విద్యను వారికి ఇవ్వడమేంటి? డబ్బున్న బాబులు మాత్రమే కొనుక్కునే ఐబీ కరిక్యులమ్ చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నేర్పించడమేంటి? నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వం వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం నేరమే అంటోంది ఎల్లో మీడియా. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్కరణలపై అవగాహనా రాహిత్యంతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకే తరహా సిలబస్ అమల్లో ఉన్నా.. పాఠశాలల్లో ఏ సిలబస్ అమల్లో ఉందో.. ఏ పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నారో తెలుసుకోకుండా విషపు కథలు అల్లుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా సిలబస్ అమల్లో ఉంది. ఎన్సీఈఆర్టీ టెక్ట్స్‌బుక్స్ మాత్రమే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసే పాఠశాలల్లో కూడా ఇవే టెక్ట్స్‌బుక్స్ ఉంటాయి. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐబీల్లో బోధన, పరీక్ష విధానాలు మాత్రమే మారుతాయి. ఎన్సీఈఆర్టీ బుక్స్‌ను మారిస్తే దేశంతో పాటు రాష్ట్రంలోనూ మారతాయిగాని, బోర్డు అనుబంధాన్ని బట్టి పుస్తకాలు మారవు. వర్తమాన కార్యాచరణపై దృష్టి ఆంధ్రప్రదేశ్‌లోని పాఠ్య పుస్తకాలు వర్తమాన కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించి రూపొందించారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పొందడం, పునాది అక్షరాస్యతను ప్రోత్సహించడం, పదజాలం, ద్విభాషా నిర్మాణం, క్యూఆర్ కోడ్స్‌తో శక్తివంతం చేయడం, గణితం, పర్యావరణ శాస్త్రంలో ప్రపంచ ప్రమాణాలను అందించడం వంటి విభిన్న దృక్కోణాలను ప్రోత్సహించేలా తయారు చేశారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు మారతాయి అనేది అపోహ మాత్రమే. మెరుగైన బోధన, అత్యున్నత మూల్యాంకనం అంశాల్లో మాత్రమే మార్పు ఉంటుంది. విద్యార్థికి ప్రపంచ పోకడలపై అవగాహన రాష్ట్రంలో ప్రతి బిడ్డను ప్రపంచంతో పోటీపడేలా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంతో వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు బోధనలో మార్పు తెచ్చింది. విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యసనం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించింది. డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అమలుచేస్తూ ఆశించిన ఫలితాలను సాధించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేందుకు ‘ఇఫ్లూ’ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఎస్సీఈఆర్టీ కృషి చేస్తోంది. ప్రపంచంలో 11 వేల వర్సిటీలుఆమోదించిన టోఫెల్ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను కొలిచేందుకు నిర్వహించే ఓ ప్రామాణిక పరీక్ష. ప్రపంచంలో దాదాపు 90 దేశాల్లోని 11 వేల కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ పరీక్షను ఆమోదించాయి. ప్రపంచంలో ఎక్కడైనా రాణించాలంటే ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలనే సదుద్దేశంతో 1947లో టోఫెల్ మొదలు పెట్టారు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద లాభాపేక్షలేని విద్యా పరీక్ష అంచనా సంస్థ అయిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం మన విద్యార్థుల్లో ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల బలాలు, సవాళ్లను సూచిస్తూ.. వారు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు. టోఫెల్ జూనియర్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసి, భవిష్యత్‌లో వారు టోఫెల్ పరీక్షను సునాయాసంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈటీఎస్ సహకారంతో ఎస్సీఈఆర్టీ ప్రతినెలా టోఫెల్ లెర్నింగ్ మెటీరియల్ విడుదల చేస్తోంది. లిక్విడ్ అనే సంస్థ ఉచితంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు 9వ తరగతిలో టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరవుతారు. దానికోసం మూడో తరగతి నుంచే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం లేదు. టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. పిల్లలకు సమాజాన్ని అర్థం చేసుకునే విద్య ప్రభుత్వం రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలలను సీబీఎస్ఈకి అనుసంధానించింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించింది. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచ సంక్లిష్టతను అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే విద్యనందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) కరిక్యులంపై దృష్టి సారించింది. విద్యార్థులలో ప్రస్తుతమున్న కంఠస్థం, ధారణ, పరీక్ష సమయంలో పునశ్చరణ వంటి వాటికి భిన్నంగా ప్రాబ్లెమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జి ఫర్ లైఫ్ స్కిల్స్, ఫ్యూచర్ స్కిల్స్ వంటివి అందిస్తోంది. దీంతోపాటు సంగీతం, కళ, వ్యాపార పరిపాలన మొదలైన వాటికి సమాన ప్రాధాన్యతనిస్తూ, చక్కటి పాఠ్యాంశాలను అందించే ఐబీ బోర్డు పాఠ్యాంశాలను మన విద్యా విధానంతో అనుసంధానించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీనికోసం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి.. 2025 నాటికి ఐబీ కరిక్యులంను మన పాఠ్యప్రణాళికలో భాగం చేసేందుకు అడుగులు వేస్తోంది. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబులను అందించింది. ఈ సంవత్సరం ట్యాబ్‌లలో సమస్యలను పరిష్కరించే డౌట్ క్లియరెన్స్ యాప్, విదేశీ భాషలు నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్‌ను ఇన్స్టాల్ చేసింది. వీటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి డైట్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరమ్మతులు వస్తే సచివాలయాల్లో వాటిని బాగుచేసి ఇస్తోంది. అంతేకాక తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌ను అమర్చి డిజిటల్ కంటెంట్‌ను అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిలో సిలబస్‌లో భాగం కానున్న ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్టులు బోధించేందుకు పలు సంస్థల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసింది. -
టీటీఏ ఆధ్వర్యంలో..ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసురూమ్‌లు ఏర్పాటు చేసింది. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో మయూర్ రెడ్డి బండారు 25 పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్ సామాగ్రి అందించారు. ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన టీటీఏ సభ్యులకు చిన్నారులు సాగర స్వాగతం పలికారు. టీటీఏ బృందం ఇచ్చిన ప్రోత్సాహానికి పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు టీచర్లను సన్మనించి, మెమంటోలు అందించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఆధునికం.. రక్షణ అధమం
యాలాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధుని క,మెరుగైన బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం అందజేసిన సామగ్రి రక్షణ.. గాలిలో దీపంలా మారింది. డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేసింది. కానీ వీటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘మన బడి’లో అభివృద్ధి పనులు మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో పగిడియాల, కోకట్, యాలాల, జుంటుపల్లి, అగ్గనూరు, బెన్నూరు పాఠశాలల్లో హైస్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసుల నిర్వాహణకు భారీగా అధునాతన పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు(ఐఎఫ్‌పీబీ)లు బహిరంగ మార్కెట్లో ఒక్కదానికి సుమారు రూ.3 లక్షల పైచిలుకు ధర ఉన్నాయి. ప్యానెల్ బోర్డుతో పాటు ఆధునిక వసతుల కలిగిన డ్యుయల్ డెస్క్ టేబుళ్లు, గ్రీన్ బోర్డు, ఎలక్ట్రానిక్ ప రికరాలను ఏర్పాటు చేశారు.ఇలా ఒక్కో పాఠశాల కు సుమారు రూ.10లక్షల విలువైన పరికరాలను అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి వీ టిని భద్రపరిచే విషయంలో ఆందోళన నెలకొంది. వాచ్మెన్లను కేటాయించాలి.. మండల పరిఽధిలోని చాలా స్కూళ్లను తక్కువ ఎత్తున్న ప్రహరీలు, విరిగిన గేట్లు వెక్కిరిస్తున్నాయి. భద్రత పరంగా సౌకర్యాలతో పాటు ఒక్క పాఠశాలకు నిరంతర నిఘాకు వాచ్మెన్ లేడు. మండలంలోని 10 హైస్కూళ్లతో పాటు 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి సెలవులో నెల రోజుల పాటు మన ఊరు– మన బడి పథకంలో భాగంగా వాచ్మన్ల ఏర్పాటుకు నెల వేతనాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నిరంతరం దీన్ని కొనసాగిస్తే బాగుంటుందని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉన్నత విద్యకు లిప్
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం హైస్కూల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యం తగ్గింది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు సైతం వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రాథమిక స్థాయిలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో ఉన్నత పాఠశాలలో కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుండి లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం) అమలుకు కసరత్తు చేస్తున్నారు. ● కరోనా కారణంగా 2020–21 సంవత్సరం నుంచి విద్యార్థులు రెండేళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో డిజిటల్ తరగతులు నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ● తెలుగు, హిందీ, ఆంగ్లం చదవడం, రాయడం రాని వారు కూడా 9వ తరగతిలోనూ ఉన్నారని, అదే విధంగా చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు రానివారు కూడా ఉన్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ● ఇలాంటి విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ లిప్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ● గత సంవత్సరం విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఇదే తరహాలో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థుల ను చదివించడం, రాయించడం, పాఠాలు వినేలా చేయడం, సాధనల్లో పిల్లల భాగస్వామం, ప్రతి స్పందనలు, స్లిప్ టెస్ట్‌లు వంటి వాటిని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 192 ప్రాథమికోన్నత పాఠశాలలు, 240 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 11 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 92 వేల మంది ఉన్నారు. విద్యార్థులకు ఉపయోగకరం కరోనా నేపథ్యంలో విద్యార్థులు రెండు సంవత్సరాలుగా డిజిటల్ తరగతులకే పరిమితమమాయ్యరు. దీంతో చాలా మంది విద్యార్థులకు చదవడం, రాయడం కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం ద్వారా రాయడం, చదవడం వంటి వాటిని నేర్పించారు. ఈ తరహాలోనే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు లిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -
ఏపీలో డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్‌ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసావాచా ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమేననుకున్న డిజిటల్ విద్య పేదలకూ అందుతోంది. డివైడ్‌ను తగ్గిస్తూ డివైజ్‌లూ అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ఏడాది 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్‌లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికీ అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అలవాటు చేయటంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లివ్వటంతో పాటు... 8, ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ డిజిటల్ సదుపాయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశముంది. ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేయటమే కాదు. వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ‘నాడు–నేడు’ పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్‌పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యసనం కొనసాగించేందుకు ఆస్కారమేర్పడుతోంది. పాలనలోనూ డిజిటల్ సేవలు... విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా అన్ని సంక్షేమ పథకాలనూ అక్రమాలకు, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందజేయగలుగుతున్నారు. గతంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల కింద ఖర్చు చేస్తున్నట్లు చూపించటమే తప్ప ప్రజలకు వాటి ఫలాలు అందలేదు. మధ్యవర్తులు, దళారులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు. డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవటంతో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పడింది. రాష్ట్రంలో గ్రామ, వార్డుల వారీగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. తద్వారా అర్హుౖలైన ప్రతి లబ్ధిదారుకూ ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, శిశువుల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అంగన్వాడీ కార్యకర్తలకూ ఫోన్లు అందించారు. 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు... 15వేల మందికి పైగా ఏఎన్ఎంలకు ట్యాబులు పంపిణీ చేయటంతో వారి ద్వారా అందజేస్తున్న సేవల్లో పూర్తి పారదర్శకత సాధ్యమయింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయటమే కాక అక్కడ 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికీ శ్రీకారం చుట్టారు. -
డిజిటల్ తరగతులకు దన్ను
అనంతపురం: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇన్షియేటివ్స్‌లో భాగంగా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు నిర్వహించనున్నారు. ఐసీటీ, స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటుకు సమగ్రశిక్ష దన్నుగా నిలుస్తోంది. విద్యారంగంలో ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది. ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషన్ స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో 100లోపు విద్యార్థులు ఉంటే రూ.2.5 లక్షలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.4.50 లక్షలు, 250 నుంచి 700 మంది ఉంటే రూ.6.4 లక్షల గ్రాంట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ గ్రాంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతులు రాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 957 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లు పూర్తిగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ, వీజే కనెక్టివిటీ, రికార్డెర్డ్ బోర్డు వర్క్, డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం, ఆడియో, వీడియోలు ప్రదర్శనకు వీలు, ప్యానల్లోనే స్పీకర్ల ఏర్పాటు, స్పెసిఫికేషన్ల ఇంటెల్‌కోర్ ఐ–5, ఏఎండీ రీజెఎన్5 ప్రాసెసర్, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. నాడు–నేడు బడుల్లో చకచకా ఏర్పాట్లు మనబడి ‘నాడు – నేడు’ కింద తొలి దశ పనులు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ బోధన చేస్తారు. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 65 ఇంచులతో ఉండే 1,463 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిజిటల్ కంటెంట్ సిద్ధం డిజిటల్ విద్యాబోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిలబస్‌కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ –కంటెంట్‌ను సీబీఎస్ఈ విధానంలో రూపొందిస్తోంది. వీటిలో ఆడియో, వీడియో తరహాలో కంటెంట్ ఉండనుంది. స్మార్ట్ తరగతులకు చర్యలు మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ తరగతులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తక్కిన వాటిలో కొత్తగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి సమగ్రశిక్ష విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 957 స్మార్ట్ తరగతులు రానున్నాయి. – బి.ప్రతాప్‌రెడ్డి, ఆర్జేడీ, విద్యాశాఖ -
AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధనా కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. చదవండి: లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. కన్నీరు పెట్టించిన ఫొటోలు, వీడియోలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్ ద్వారా ఈ కంటెంట్‌ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్ ల్యాబ్‌లకు ఈ–కంటెంట్‌ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌ల్లో డిజిటల్ డివైస్‌లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్‌ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది. డిజిటల్ తరగతులకు సన్నాహాలు మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద 2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్ బ్యాండ్, లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్, పోర్టబుల్ హాట్‌స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. -
పాఠాలకు డిజి‘ట్రబుల్’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటులో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అతి కీలకమైన నెట్వర్క్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇంటర్నెట్ సదుపాయం లేకుంటే రూ.కోట్లు వెచి్చంచినా ప్రయోజనం ఏమిటని సర్వశిక్షా అభియాన్ సందేహాలు లేవ నెత్తుతోంది. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.300 కోట్లు వెచి్చంచాలనుకున్నారు. ఎంపిక చేసిన స్కూల్లో రెండు స్మార్ట్ క్లాస్ రూముల చొప్పున, మొత్తం 6 వేలు ఏర్పాటు చేయాలని భావించారు. దీనిపై ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేయించింది. మొబైల్ డేటా కూడా అంతంత మాత్రమే.. ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందులో భాగంగానే స్మార్ట్ క్లాసు రూంల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచి్చంది. డిజిటల్ క్లాస్ రూంలో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులను అమర్చాల్సి ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డిజిటల్ పాఠాలను విద్యార్థులకు చేరవేయాలని భావించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 3 వేల స్కూల్స్‌ను డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటుకు ఎంపిక చేస్తే 131 మండలాల పరిధిలోని 878 గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదని తేలింది. ఈ ప్రాంతాల్లో కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా అంతంత మాత్రమేనని అధికారులు గుర్తించారు. కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. హార్డ్ డిసు్కతో నెట్టుకు రావలసిందేనా? 6 నుంచి 10వ తరగతి వరకూ డిజిటల్ పాఠాలు అందించాలని భావిస్తున్నారు. అవసరమైన పాఠాలను నిపుణుల చేత ముందే రికార్డు చేసి, వాటిని క్లౌడ్‌లో నిక్షిప్తం చేస్తారు. నెట్వర్క్ ద్వారా ప్రతి పాఠశాల క్లౌడ్‌కు కనెక్ట్ అవ్వొచ్చు, ఇది వీలుకాని పక్షంలో హార్డ్ డిస్క్ సాయంతో పాఠాలు వినే ఏర్పాటు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు ఇదే సరైన విధానంగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు. నెట్వర్క్ ఉంటే విద్యార్థి అర్థం కాని పాఠాన్ని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం ఉంది. ఇంటి వద్ద కూడా డిజిటల్ లే»ొరేటరీకి కనెక్ట్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ సర్వర్‌లో ఉంటుంది కాబట్టి డేటా పోయే అవకాశం ఉండదు. అదే హార్డ్ డిస్క్ స్కూల్లో ఒకచోటే ఉంటుంది. డేటా పోయేందుకూ, ఎర్రర్ వచ్చేందుకూ అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరింపజేయడమా? హార్డ్ డిస్క్‌ల ద్వారా పాఠాలు చెప్పించడమా? అనే దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవలసి ఉంది. -
స్కూళ్లను కాదని ఆన్‌లైన్‌కు వెళితే.. చదువుకు చెద!
నిరంతరాయంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పేదలు, అణగారిన వర్గాల పిల్లలు చాలా నష్టపోతారు. అసమానతలు పెరిగి, సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో డ్రాపవుట్లకు దారితీస్తోంది. పాఠశాలలు తెరిచిన తరువాత బాలలకు సరైన సామర్థ్యాలు లేక స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. చివరకు వారు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. – యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) నివేదిక సాక్షి, అమరావతి: కరోనా మూడో వేవ్ ఉన్నప్పటికి, విద్యార్థుల భవిష్యత్తు, అభ్యసన సామర్థ్యం దెబ్బతినకుండా విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలతో విద్యాసంస్థల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) కూడా పాఠశాలలను తెరవాలనే చెబుతోంది. విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష బోధనే మేలని వెల్లడించింది. పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఉన్నత, పేద వర్గాలకు మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని, ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీని పర్యవసానాలపై యునెస్కో అంతర్జాతీయంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి, ఇటీవల ‘కోవిడ్–19 ఎడ్యుకేషన్ రెస్పాన్స్’ పేరిట నివేదికను విడుదల చేసింది. విద్యా సంస్థల మూసివేత వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు.. అంతిమంగా సమాజానికి ఎంతటి నష్టమో వివరించింది. ప్రత్యక్ష బోధన లేక సామర్థ్యాలు, నైపుణ్యాలకు దెబ్బ పాఠశాలలు తెరచి ప్రత్యక్ష బోధన చేయడం వల్ల విద్యార్థులకు ఆశించిన మేరకు అభ్యాసన సామర్థ్యాలు లభిస్తాయి. పాఠశాలలు మూసివేస్తే వారిలో ఉన్న అభ్యసన సామర్థ్యాలను కూడా కోల్పోతున్నారు. సందేహాలు తీర్చే వారుండరు. వారిలోని లోపాలను సరిచేసే వారుండరు. దీంతో వెనుకబాటుకు గురవుతున్నారు. గత రెండేళ్లలో పాఠశాలలు మూతపడి ఈ సమస్య చాలా పెరిగిందని అసర్ సర్వే కూడా తేటతెల్లం చేసింది. స్కూళ్ల మూసివేత వల్ల అట్టడుగు వర్గాల పిల్లలు మరింతగా నష్టపోతారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకు వచ్చే పిల్లల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారే. వీరికి సరైన ఆహారమూ ఇళ్లలో అందదు. పాఠశాలలు తెరిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. లేకపోతే ఆ ఆహారమూ లేక ఆకలితో అలమటిస్తారు. సరైన ఆహారం అందక శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. డిజిటల్ పరికరాల లేమి ఆన్లైన్ బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాఖ తగిన ఏర్పాట్లు చేస్తున్నా, ఈ స్కూళ్లలో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే. వారికి డిజిటల్ పరికరాలు లేక ఆన్లైన్ బోధనను అందుకోలేకపోతున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల పిల్లలు మరింత వెనుకబాటుకు లోనవుతున్నారు. వారి కోసం దూరదర్శన్, ఆలిండియా రేడియోల ద్వారా పాఠాలను ప్రసారం చేయిస్తున్నా, టీవీ లేని వారికి అవీ అందడంలేదు. పాఠాలు ప్రసారమయ్యే సమయాల్లో పిల్లలను టీవీలు, రేడియోల ముందు కూర్చోబెట్టి వాటిని నేర్చుకొనేలా చేసే అవకాశం పనులకు వెళ్లిపోయే ఆ పేద తల్లిదండ్రులకు ఉండడంలేదు. డిజిటల్ పరికరాలు ఉన్న టీనేజ్ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇతర దురలవాట్లకు లోనయ్యే ప్రమాదమూ ఉంటోంది. వాటి ద్వారా పాఠాల అభ్యసనానికి బదులు ఇతర దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అదే స్కూళ్లు తెరిచి ఉన్నప్పుడు పిల్లల చదువు సంధ్యలను టీచర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలు మూసివేత వల్ల వైరస్ భయంతో పెద్దలు పిల్లలను బయట కూడా తిరగనివ్వడంలేదు. పిల్లలు ఇళ్లలోనే మగ్గిపోయి, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పెద్దల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని యునెస్కో అభిప్రాయపడింది. బాల్య వివాహాలు పాఠశాలలు మూతపడి స్కూళ్లకు వెళ్లాల్సిన టీనేజ్ ఆడ పిల్లలు ఇళ్లకే పరిమితమై పోతుండడంతో తల్లిదండ్రులు వారికి పెళిŠల్ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది బాల్య వివాహాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లకే పరిమితమై ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నట్లు యునెస్కో వివరించింది. ఉపాధ్యాయులకూ సమస్యే పాఠశాలలు తెరిస్తే ఉపాధ్యాయులు నేరుగా బోధిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుస్తారు. పిల్లలతో నేరుగా సంభాషించి, వారిలోని లోపాలను అప్పటికప్పుడు సరిచేస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. అదే స్కూళ్లు మూతపడితే ఆన్లైన్లోనో, డిజిటల్ విధానం, వాట్సప్, ఇతర ప్రక్రియల ద్వారా బోధించాలి. విద్యార్ధులతో నేరుగా మాట్లాడలేరు. వారి సామర్థ్యాలను అంచనా వేయలేరు. మరోవైపు పాఠ్యాంశాలను ఆన్లైన్, డిజిటల్ ప్రక్రియల్లోకి మార్చడం కూడా టీచర్లకు సమస్యే. వీడియోలో రికార్డు చేసి బోధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ కంటెంట్లను విద్యార్థులకు సరిగా అందించలేక ఎక్కువ శాతం టీచర్లు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆన్లైన్ బోధన వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాలు కూడా సరిగా ఉండవని యునెస్కో వెల్లడించింది. గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలందరినీ వారి సామర్థ్యాలు, ప్రతిభతో సంబంధం లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటించాల్సి వచ్చింది. తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి పాఠశాలల మూత వల్ల పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి అందించడం పెద్ద సమస్యగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వీటి కోసం అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వీటిని సమకూర్చలేక పిల్లల చదువులపై ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆ పరికరాలు సమకూర్చినా, చదువులు ఎలా సాగుతున్నాయోనని పర్యవేక్షణ మరో సమస్య. వాటి వినియోగంలో పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థంకాక అయోమయంలో పడుతున్నారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకూ ఆన్లైన్ వనరులు సమకూర్చడం సమస్యే పాఠశాల తరగతిలో బోధన జరిగితే స్కూళ్ల యాజమాన్యాలు ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. పాఠశాలలు మూసివేస్తే ఆన్లైన్ బోధనకు ఏర్పాట్లు చేయడం స్కూళ్లకూ సమస్యగా మారింది. ఆన్లైన్ బోధనకు అనువుగా పోర్టళ్లు, కంటెంట్‌ను రూపొందించాలి. ఇవన్నీ యాజమాన్యాలకు తలకుమించిన భారం. వీడియో కంటెంట్లు, లైవ్ ఆన్లైన్ తరగతులు కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా పరిమితంగానే అమలవుతున్నాయి. బడ్జెటరీ పాఠశాలల్లో అదీ ఉండడం లేదు. ఏపీలో అనేక జాగ్రత్తలతో పాఠశాలలు పాఠశాలల మూసివేత వల్ల అనేక నష్టాలు, పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్రంలో పాఠశాలలను కొనసాగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ çపూర్తిస్థాయి జాగ్రత్తలతో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా యుద్ధప్రాతిపదికన టీకాలు వేస్తోంది. ప్రభుత్వ చర్యలతో సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రారంభమైన స్కూళ్లకు తొలి రోజే 61 శాతం మంది పిల్లలు హాజరవడం విశేషం. ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ మేలు మానసిక కోణంలో ఆలోచిస్తే విద్యార్ధులకు శిక్షణ, క్రమశిక్షణ చాలా అవసరం. పాఠశాలలు చదువు చెప్పే కేంద్రాలే కావు. పిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి, భావి పౌరులుగా తీర్చిదిద్దే సంస్థలు. పిల్లల్లోని ఎమోషన్సును బేలెన్సు చేసేవి స్కూళ్లే. ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కనుక అనేక అంశాలు నేర్చుకుంటారు. టీచర్ నేరుగా చెప్పడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. సాధ్యమైన మేరకు తరగతులు నిర్వహించడమే మంచిది. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించడమే మేలు. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం స్కూళ్లు మూస్తే నష్టం స్కూళ్లు మూసివేయడం వల్ల గత రెండేళ్లుగా మా పిల్లలు చాలా నష్టపోయారు. ఆన్లైన్ బోధన వల్ల పాఠాలేవీ నేర్చుకోలేదు. వారి పరిస్థితి చూసి మాకే కష్టమనిపించింది. ఇప్పుడు కూడా స్కూళ్లు మూసివేస్తే మరింత నష్టపోతారు. కరోనా ఉన్నా మాస్కులు వేసి స్కూళ్లకు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నడిపించడమే మంచిది. – పెద్దిరెడ్డి (విద్యార్థి తండ్రి) పడమటి యాలేరు, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అన్నీ తెరిచే ఉన్నాయిగా.. సినిమా హాళ్లు, షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, మార్కెట్లు అన్నీ తెరిచే ఉంటున్నాయి. పండగలు, జాతరలు, ఉత్సవాలూ వేలాది మందితో జరుగుతున్నాయి. వాటివల్ల రాని కరోనా సమస్య పాఠశాలలు తెరిస్తే వస్తుందా? రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరవకపోవడం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికీ స్కూళ్లు మూసే ఉంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలి. – శ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి, అనంతపురం మరింత నష్టపోకూడదు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లు తెరవడమే మేలు. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు పిల్లలు నష్టపోయారు. వారు మరింత నష్టపోకుండా స్కూళ్లలోనే బోధన జరగాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది రాదు. – ఓబుళపతి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
సిలబస్ టెన్షన్.. బుర్రకెక్కింది అంతంతే...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆన్లైన్ బోధన నేపథ్యంలో సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. బుర్రకెక్కింది అంతంతే... ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నాటికి పూర్తయిన సిలబస్ ఆధారంగా గత నెలలో ఎస్ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులకే పరిమితం పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆన్లైన్ తరగతులే.. ► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు) ► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో మొదట మూడు నెలల పాటు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త చట్టం కోసం..) -
ఆన్లైన్ పాఠాల్లేవ్.. పనులే
ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరికి చెందిన ఈ విద్యార్థి పేరు నరేశ్. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ పాఠాలు అర్థంకావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అన్నయ్యకు తోడుగా గొర్రెలు మేపేందుకు పంపుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న క్రమంలో.. పదేళ్లలోపు పిల్లలను ఇంటివద్ద ఒంటరిగా వదలలేక పోతున్నారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా తమ వెంట తీసుకెళ్తున్నారు. కరోనాతో ఉపాధి దెబ్బతినడం.. ఆస్పత్రులకు అయిన ఖర్చులతో చాలా కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఇప్పుడు వ్యవసాయ పనుల సీజన్ కావడం, ఆన్లైన్ క్లాసులు అర్థంకాని పరిస్థితులు ఉండటంతో.. పిల్లలను కూడా పనులకు పంపుతున్నారు. కూలీల కరువు.. రేట్లు పెరగడంతో.. ఈ ఫోటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు పీరబోయిన గణేశ్. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన గణేశ్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కూలి రేట్లు పెరిగిపోయి తల్లిదండ్రులు వ్యవసాయంలో ఇబ్బంది పడుతుండటంతో.. క్లాసులకు హాజరుకాకుండా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. (సాక్షి నెట్వర్క్) కరోనా దెబ్బతో పాఠశాలలు మూసి ఉంచడం, ఆన్లైన్ పాఠాలే దిక్కు అవడం పిల్లల చదువులకు శరాఘా తంగా మారింది. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు లేక, అవి ఉన్నా సిగ్నళ్లు సరిగా అందక, డేటా చార్జీలను భరించలేక, అన్నీ ఉన్నా ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. పిల్లలు చదువులు వదిలి పనుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులతో మాట్లాడి పలు అంశాలపై సర్వే చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఇబ్బందులను గుర్తించింది. ఆన్లైన్ పాఠాలు, బోధన తీరుపై దాదాపు అందరిలోనూ అసంతృప్తి కనిపించింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు రాయటం, చదవటం సమస్యగా మారిందని.. వారి మానసిక స్థితి ఇబ్బందికరంగా తయారవుతోందని ఆందో ళన వ్యక్తమైంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యే పరిస్థితి లేద ని.. పలు కఠిన నిబంధనలు పెట్టి అయినా పాఠశాలలను తెరవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడటం గమనార్హం. ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ఆర్థిక ఇబ్బందులతో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాసులు ఓ మోస్తరుగా బాగానే జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద కుటుంబాలు కావడంతో స్మార్ట్ఫోన్లు కొనలేకపోవడం, కొన్నా డేటా కోసం అదనపు ఖర్చు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నచోట ఒకే ఫోన్ ఉండటంతో వారు మాత్రమే పాఠాలు వినడం వంటివి జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను వ్యవసాయం, ఇతర పనులకు తీసుకెళ్తు న్నారు. ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థం కావడంలేదని పిల్లలు చెప్తుండటం, ఇంట్లోనే ఉంటుండటం కూడా దీనికి కారణమవుతోంది. వ్యవసాయ సీజన్ కావడంతో కూలీల కొరత నెలకొంది. రేట్లు పెరిగాయి. దీనివల్ల కూడా పిల్లలు ఆన్లైన్ పాఠాలను పక్కనపెట్టి.. కూలిపనులకు వెళ్లడం పెరిగింది. అందని సిగ్నళ్లు.. కరెంటు కోతలు పట్టణప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నళ్లు బాగానే ఉన్నా.. జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో సెల్‌ఫోన్ సిగ్నళ్లు సరిగా అందడం లేదు. కాసింత సిగ్నల్ వచ్చినా అది ఆన్లైన్ పాఠాలకు సరిపడేంతగా డేటా స్పీడ్ రావడం లేదు. పొలాల్లో మంచెలు, చెట్లు ఎక్కి పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామాల్లో కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండటం లేదు. అక్కడక్కడా కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి. దీంతో పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక తల్లిదండ్రులతో పనులకు వెళ్తున్నారు. ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. చాలా మంది విద్యార్థులు తమకు ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థంకావడం లేదని వాపోతున్నారు. సిగ్నల్ సరిగాలేక తరచూ ఆగిపోతుండటం, ఉపాధ్యాయుల గొంతు సరిగా వినిపించకపోతుండటం వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దానికితోడు తమ వద్ద ఉన్న ఫోన్లలో ధ్వని సరిగా రావడం లేదని కొందరు చెప్తున్నారు. ఏదైనా సందేహం వస్తే.. అడిగి తెలుసుకునే అవకాశం లేక పాఠం అర్థంకావడం లేదని వాపోతున్నారు. ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారని.. ఆన్లైన్ పాఠాల కోసమని తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ అప్ప గిస్తే.. పలుచోట్ల పిల్లలు గేమ్స్ ఆడుతూ, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. పిల్లలను ఆన్లైన్ క్లాసుల కోసం ఇంట్లో వదిలి తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అంతేగాకుండా పిల్లలు క్లాసులను పక్కనపెట్టేసి ఆటలు ఆడటానికి వెళ్తున్నారని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. అందుకని ఇంట్లో వదలకుండా వ్యవసాయం, ఇతర పనుల కోసం తమ వెంట తీసుకెళ్తున్నామని తెలిపారు. సరైన పర్యవేక్షణ, అవగాహన ఏదీ.. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఆన్లైన్ తరగతులతోపాటు టీవీల్లో డిజిటల్ పాఠాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫోన్, టీవీ సదుపాయం లేనివారికి సమీపంలోని తోటి విద్యార్థుల ఇళ్లలోగానీ, గ్రామ పంచాయతీల్లోని టీవీల్లో గానీ తరగతులు వీక్షించేలా ఏర్పాట్లు చేయా లని విద్యా శాఖ గతంలోనే ఆదేశించింది. కానీ ఈ విషయంగా సరైన పర్యవేక్షణ జరగక.. చాలా మంది విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ఎక్కడిక్కడ 70–80 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్/డిజిటల్ తరగతులకు హాజరవుతున్నట్టు అధికారులు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠాలు వింటున్నది సగమే! ఆన్లైన్/డిజిటల్ పాఠాలపై ‘సాక్షి’నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాల ల్లో తోటివారితో కలిసి చదువుకునే విద్యార్థులు.. ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నారని, ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, క్రమశిక్షణ లేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యార్థులకు ఫోన్ వ్యసనంగా మారుతోందని, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో పాఠాలు వినడం లేదని.. విన్నా సరిగా అర్థం కావడం లేదని దాదాపు సగం మంది విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ తరగతులు బాగోలేవని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు టీచర్లు కూడా అభిప్రాయపడ్డారు. తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్/ట్యాబ్ అందుబాటులో లేవని, అప్పులు చేసి కొన్నామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. ఆన్లైన్ పాఠాలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల అభిప్రాయాలు. స్మార్ట్‌ఫోన్ లేక.. పశువులు కాస్తున్న ఈ చిన్నారి పేరు గణేశ్. మెదక్ మండలం మక్తభూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తండ్రి శ్రీశైలం వద్ద ఒక్కటే ఫోన్ ఉంది. ఆయన బయటికి వెళ్తే.. గణేశ్ పాఠాలు వినే పరిస్థితి లేదు. దాంతోపశువులు మేపేందుకు వెళ్తున్నాడు. పాఠాలు సరిగా వినట్లేదని.. ఈ ఫొటోలోని బాలుడి పేరు వినయ్ కుమార్. సూర్యాపేట జిల్లాలోని కుంటపల్లికి చెందిన ఈ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు అర్థంకావడం లేదంటూ పాఠాలు వినడం లేదు. ఇంట్లోంచి బయటికెళ్లి ఆటలాడుతున్నాడని, ఏదైనా ప్రమాదానికి గురవుతాడోనని ఆందోళన చెందిన తండ్రి మల్లయ్య.. వినయ్‌ను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నాడు. స్మార్ట్‌ఫోన్ కోసం.. ఈ ఫొటోలో వరినారు తీస్తున్న విద్యార్థి పేరు శేఖర్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సాకు చెందిన శేఖర్.. ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. స్మార్ట్‌ఫోన్ లేక ఆన్లైన్ పాఠాలు వినడం లేదు. ఫోన్ కొనుక్కునేందుకు డబ్బుల కోసం కూలిపనులకు వెళ్తున్నట్టు తెలిపాడు. వారానికి రెండు క్లాసులైనా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు వారానికి రెండు క్లాసులైనా తీసుకుంటే మంచిది. దూరదూరంగా కూర్చోబెట్టి బోధన చేయొచ్చు. మిగతా రోజుల్లో వర్క్షీట్ల ద్వారా పాఠాలపై అవగాహన కల్పించవచ్చు. ఆన్లైన్ ద్వారా ఏకబిగిన పాఠాలు బోధించడం వల్ల కంఠశోష తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. - జి.నాగభూషణం, ప్రధానోపాధ్యాయుడు, మన్నెంపల్లి, కరీంనగర్ జిల్లా -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
Telangana: రేపటి నుంచే ఆన్లైన్ తరగతులు
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్): కరోనా వ్యాప్తి నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని ప్రభుత్వం గుర్తించి ఈ విద్యాసంవత్సరం (2021–22) కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించనున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంగించరాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లో, స్మార్ట్ ఫోన్లో తరగతులు వినే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. 6,7,8 తరగతులు చదువుతున్న 44,918 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీరందరికి పాఠశాలలు ప్రారంభం రోజు నుంచి పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. విధులకు 50 శాతమే హాజరు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలకు రోజుకు 50 శాతం సిబ్బంది హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరైన టీచర్లు విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా? లేదా అనేది పర్యవేక్షణ చేయనున్నారు. డిజిటల్ తరగతుల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద వినేవిధంగా ఉపాధ్యాయులు చర్య తీసుకోవాలని. గతంలా కాకుండా ఈ ఏడాది మార్కుల ఆధారంగానే ఉత్తీర్ణులను చేసే అవకాశం ఉందని, అందుకు విద్యార్థులను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ముందుగానే విద్యార్థులకు వర్క్‌షీట్ అందజేస్తారు. ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ సారి పిల్లల ప్రొగ్రెస్‌ను బట్టి మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ విద్యార్థి డిజిటల్ తరగతులు వినే విధంగా చూసుకుంటే మంచిది. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఇళ్లల్లో డిజిటల్ తరగతులు వింటున్నారా?లేదా అనేది పర్యవేక్షణ చేయాలి. – వాసంతి, డీఈఓ చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు -
8వ తరగతి వరకు బడులు బంద్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగింపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అం శాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కన 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించింది. 6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రం ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేటు యాజమాన్యాలు 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన చేపడుతున్నాయి. ఇదే అదనుగా 85 శాతానికిపైగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసుకున్నాయి. మరోవైపు ప్రత్యక్ష బోధన కార ణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఈ వారంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, టీచర్ల సంఖ్య వందలకు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విజృంభిస్తోంది. బుధవారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత అసెంబ్లీలోనూ దీనిపై మాట్లాడారు. కేసుల నమోదు పెరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. ఈ నేపథ్యంలో స్కూళ్లు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఏయే తరగతులకు ఉండాలి.. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు టీవీ/ ఆన్లైన్ పాఠాలే కొనసాగుతున్నాయి. ప్రత్యక్ష బోధన లేదు. 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. అయితే 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపేస్తే విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఇబ్బందిగా మారుతాయన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది. పైగా పదో తరగతి పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. విద్యార్థులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగించాలన్న వాదన ఉంది. అయితే వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలా, ఆన్లైన్తోనే సరిపెట్టాలా? అన్న అంశంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక 6, 7, 8 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధన అవసరం లేదన్న భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్టు తెలిసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్/ డిజిటల్ బోధన కొనసాగించేలా.. వారందరిని పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీలైతే 9వ తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పదో తరగతికి పంపించే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు లేకుండానే కనీస మార్కులతో పాస్ చేయాలని కొన్ని రోజుల కింద ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులు మాత్రం అది సరికాదంటూ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ త్వరలోనే ఈ అంశాలన్నింటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
‘టీ–శాట్ విద్యా, నిపుణ’ యాప్ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో విద్యా సంబంధిత విషయాలను అందిస్తున్న టీ–శాట్ నెట్వర్క్ విద్యా, నిపుణ చానెళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆ యాప్‌కు ఏకంగా 10 లక్షల డౌన్లోడ్లు నమోదయ్యాయి. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న ఈ చానెళ్లు కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ తరగతులను కూడా మొదలుపెట్టాయి. 10 లక్షల డౌన్లోడ్ల మైలురాయిని సాధించిన సందర్భంగా టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. వీరు చేసిన కృషిని మున్సిపల్, ఐటీ శాఖ కేటీఆర్ ప్రశంసించారు. కోవిడ్ పరిస్థితుల్లో డిజిటల్ క్లాసుల ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నేర్చుకునే విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. టీ–శాట్ ప్లాట్‌ఫామ్ కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు దాని సేవలు ఉపయోగించుకునేలా రూపొందాలని ఆకాంక్షించారు. టీ–శాట్ సేవలు, విస్తృతిని పెంచేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించా రు. తమ చానెళ్లు ఇప్పటికే ఎయిర్టెల్, టాటా స్కైతో 43 కేబుల్ నెట్‌వర్క్‌లతో పాటు సన్ డైరెక్ట్ డీటీహెచ్‌లోనూ వీక్షించవచ్చునని సీఈఓ శైలేశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. -
భోజనం కోసమే వచ్చేవారికి ఆన్లైన్ క్లాసులా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్ వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు ‘ఆక్స్‌ఫామ్ ఇండియా’ స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంది. డిజిటల్ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్ సదుపాయం అందుబాటులో లేదు. ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?) ఆన్లైన్ తరగతులు ప్రారంభానికే ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్ సదుపాయం అందుబాటులో లేదని ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో డిజిటల్ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు. గత మార్చి నెలలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్ నెలలో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే. మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లర్నింగ్ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది. (చదవండి: ఇంటివద్దకే బడి) -
సందేహాలు తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ‘మెజారిటీ విద్యార్థులు గణి తంలో కొద్దిగా వీక్‌గా ఉంటారు. టీశాట్ ద్వారా ఆన్లైన్లో తరగతులు బోధిస్తామంటున్నారు. మరి విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎలా నివృత్తి చేస్తారు?’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్లైన్ క్లాసులను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సెప్టెం బర్ 1 నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు తరగతులు బోధించాలని నిర్ణయించామని, గురువారం (ఈనెల 27) నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరుకావా లని ప్రభుత్వం ఆదేశించిందని స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ నివేదించారు. టీశాట్ ద్వారా 1–5వ తరగతి మధ్య విద్యార్థులకు 90 నిమిషాల పాటు, 6–8వ తరగతి మధ్య విద్యార్థులకు 2 గంటలపాటు, 9–10వ తరగతి విద్యార్థులకు 3 గంటలపాటు ఆన్లైన్ పాఠాలు ఉంటాయని, శని, ఆదివారాలు సెలవులు ఉంటాయని తెలిపారు. టీవీ అందుబాటులో లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీ, సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లోని టీవీలో పాఠాలు వినే ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థి పాఠాలు విలేనా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారని వివరించారు. ‘ఆన్లైన్ క్లాసులకు హాజరు తప్పనిసరా? హాజరుకాకపోతే ఎటువంటి పరిణామాలుంటాయి? ఒకే ఇంట్లో 5వ, 8వ, 11వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థులుంటే వారు టీశాట్‌లో ఒకేసారి తరగతులు ఎలా వినాలి? ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని ఆదిలాబాద్, ములుగు వంటి గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు తరగతులు ఎలా బోధిస్తారు? పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి మీరు చెబుతున్నది ఆచరణ సాధ్యమేనా?’అంటూ ధర్మాసనం పలు సందేహాలు వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశిస్తే వేరు వేరు సమయాల్లో తరగతులు నిర్వహిస్తామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని సంజీవ్‌కుమార్ వివరణ ఇచ్చారు. విద్యార్థులను ఇళ్లలో ఖాళీగా ఉంచకుండా ఆన్లైన్ క్లాసుల రూపంలో వారిని బిజీగా ఉంచేందుకే క్లాసులు నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది ఛాయాదేవి నివేదించారు. 9–12 తరగతులకు సిలబస్ తగ్గిస్తామని, తగ్గించిన సిలబస్ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేలా చూస్తామని వివరించారు. (తెరుచుకున్న బడులు ) ఎన్ని పాఠశాలలకు చర్యలు తీసుకున్నారు? ఫీజుల కోసం వేధించరాదన్న ప్రభుత్వ జీవో 46కు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.షీలు నివేదించారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాకపోయినా, ఫీజులు కట్టని వారి అడ్మిషన్లు రద్దు చేశారని తెలిపారు. ఫీజుల వసూలుకు సంబంధించి అనేక పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వారిచ్చే వివరణ ఆధారంగా పాఠశాల గుర్తింపు రద్దు చేయడం లాంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంజీవ్‌కుమార్ అన్నారు. ‘ఎన్ని పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి ? ఎన్ని పాఠశాలలకు నోటీసులు జారీచేశారు ? ఎన్ని పాఠశాలలు వివరణ ఇచ్చాయి ? ఆయా స్కూళ్ల వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఏం చర్యలు తీసుకున్నారు ?’తదుపరి విచారణ 18వ తేదీలోగా పూర్తి వివరాలు సమర్పించండి అని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకొని ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలంటూ సీబీఎస్ఈ బోర్డు ఇచ్చిన సర్క్యులర్ చట్టబద్ధం కాదని న్యాయవాది వై.షీలు వివరించారు. అయితే ఆ సర్క్యులర్‌ను కొట్టివేయాలంటూ పిటిషన్ లో మార్పులు చేయాలని, అప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. పేరెంట్స్‌పై నాన్ బెయిలబుల్ కేసులా ? ఫీజులు వసూలు చేయడాన్ని ప్రశ్నించేందుకు పాఠశాలకు వెళ్లిన పేరెంట్స్‌పై బోయిన్ పల్లి పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు ఎలా నమోదు చేస్తారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఎందుకు వారిపై కేసులు నమోదు చేయాల్సి వచ్చిందో తదుపరి విచారణ నాటికి వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. ఏపీలో సక్సెస్.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 రోజులుగా దూరదర్శన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో ఇక్కడా నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయవాది సంజీవ్‌కుమార్ నివేదించారు. జీరో విద్యా సంవత్సరం కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ తరగతులు వినని వారికి వర్క్‌షీట్స్ ఇస్తామని, వీటిని పూర్తి చేసేలా ఉపాధ్యాయులు చూస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్తారని, వారికున్న సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. -
డిజిటల్ పాఠాలు రెడీ
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడి పిల్లలకు డిజిటల్ పాఠాలు సిద్ధమయ్యాయి. కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో అవి పునఃప్రారంభమయ్యే వరకు డిజిటల్/ఆన్లైన్ పద్ధతిలో పాఠ్యాంశ బోధన సాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 నుంచి 10 తరగతుల వరకు డిజిటల్ పాఠాలను టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానల్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఈ లెక్కన మరో వారం గడిస్తే విద్యా సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యేది. కానీ కోవిడ్–19 కారణంగా పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఈ క్రమంలోనే ఆన్లైన్/డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు విద్యాశాఖ రూపకల్పన చేసింది. తొలుత జూన్, జూలై నెలల్లో జరగాల్సిన బోధనకు సంబంధించి వీడియో పాఠాలను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్(ఎస్ఐఈటీ) ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అరగంటకో పీరియడ్ డిజిటల్ పాఠాల బోధనకు విద్యాశాఖ ప్రత్యేక సమయాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఒక్కో పీరియడ్ (సెషన్) కనీసంగా అరగంట పాటు కొనసాగుతుంది. ఈ లెక్కన ఉన్నత తరగతులకు రోజుకు గరిష్టంగా 6 పీరియడ్లు కొనసాగుతాయి. డిజిటల్ పాఠాలను తెలంగాణ మోడల్ స్కూల్ సొసైటీతో పాటు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ఇందుకు నిపుణులకు మూడు రోజుల పాటు వెబినార్ ద్వారా శిక్షణ ఇచ్చారు. దూరదర్శన్ యాదగిరి చానల్లో మాత్రం రోజుకు గంటన్నర పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారమవుతాయి. ఇందుకు 3 స్లాట్లను బుక్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా రు. డిజిటల్ పాఠాల రూపకల్పనకు రూ.30 లక్షల వ్యయ అంచనాతో అధికారులు ప్రతిపాదించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించా ల్సి ఉంది. కాగా, ఆన్లైన్/డిజిటల్ పాఠాలను ఏయే తరగతులకు ఎంత సమయం పాటు బోధించాలనే దానిపై విద్యాశాఖ ఒక షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. కాలేజీ విద్యార్థులకూ ఆన్లైన్ పాఠాలు సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థులకూ డిజిటల్/ఆన్లైన్ పాఠాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. డిజిటల్, టీవీ, టీశాట్æ మాధ్యమాల ద్వారా వీడియో పాఠాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు, కాలేజీ విద్య కమిషనర్, అన్ని యూనివర్సిటీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 నుంచే బోధన సిబ్బంది విధులకు హాజరై డిజిటల్, ఈ–లెర్నింగ్ ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండియర్‌తోపాటు డిగ్రీ, పీజీ సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. -
సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధన ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఆన్లైన్ లేదా టీవీ/టీశాట్ ద్వారా బోధన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు ) మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ తరగతుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యా సంవత్సర ప్రారంభం సహా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జరపాలి అన్న అంశాలపై ప్రభుత్వం చర్చించింది. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు) -
6 నుంచి 10 తరగతులకు డిజిటల్ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యా బోధన ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉన్నత తరగతులైన 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలను (వీడియో పాఠాలను) ప్రసారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా వారికి వర్క్షీట్లు అందజేసి, అసైన్మెంట్స్ ఇవ్వడం ద్వారా విద్యా కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రతిపాదనలను రూపొందించింది. అన్ని తరగతులకు సంబంధించి 900కు పైగా డిజిటల్ పాఠాలు ఇప్పటికే రూపొందించి ఉన్నందున వాటిని టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) చానళ్ల ద్వారా ప్రసారం చేస్తూ విద్యా బోధనను అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాల బోధనకు కసరత్తు చేస్తోంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం ముందుకుసాగాలని, లేదంటే ఆగస్టు 15 నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రభుత్వం సరేననగానే వీడియో పాఠాల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యక్ష విద్యా బోధనపై విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై స్పష్టత, సమగ్ర మార్గదర్శకాలు జారీ అయ్యాకే, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకుసాగాలని భావిస్తోంది. డిజిటల్ పాఠాల టైం టేబుల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ప్రజ్ఞత’పేరుతో జారీచేసిన ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ టైంటేబుల్‌ను సిద్ధంచేసింది. తరగతుల వారీగా, రోజువారీగా ఏయే సమయాల్లో ఏయే సబ్జెక్టు పాఠాలను ప్రసారం చేయాలనే వివరాల్ని ఇందులో పొందుపరిచింది. రోజూ ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఈ విద్యా బోధన ఉండాలని కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ దిశగానే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఉన్నత తరగతులకు గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే బోధించేలా చర్యలు చేపట్టనుంది. అదీ ఒక్కో సెషన్ 30 నుంచి 45 నిమిషాలే ఉండేలా టైంటేబుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రైమరీ తరగతులకు వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ ప్రాథమిక తరగతులను (1 నుంచి 5వ తరగతి వరకు) వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ పద్ధతుల్లోనే కొనసాగించాలని ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వారికిప్పుడు రెగ్యులర్ తరగతుల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వీడియో పాఠాలు ప్రసారం చేసినా ప్రాథమిక తరగతుల విద్యార్థులు శ్రద్ధగా వినే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్స్, అసైన్మెంట్స్ ఇవ్వడం వంటి యాక్టివిటీని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొంత మంది టీచర్లను స్కూళ్లకు పంపించడం ద్వారా ప్రాథమిక తరగతులకు కూడా విద్యా కార్యక్రమాలను కొనసాగించవచ్చని పేర్కొంది. అనుమానాల నివృత్తికి ప్రత్యేకంగా ఒకరోజు టీవీ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను వినే క్రమంలో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి ఒక్కో తరగతికి ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో టీచర్లతో పాటు వారి ఫోన్ నంబర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. పాఠశాల స్థాయిలో ఫోన్ సదుపాయం ఉన్న విద్యార్థులు, సబ్జెక్టు టీచర్లతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి అందుబాటులో ఉంచేలా, మండల స్థాయిలో సబ్జెక్టు గ్రూపులను ఏర్పాటుచేసేలా ప్రణాళికలు వేసింది. గ్రామాల్లో టీవీ, ఫోన్ సదుపాయం లేని విద్యార్థులుంటే వారు స్కూల్‌కు వెళ్లి నేర్చుకునేలా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీచర్లను రొటేషన్ పద్ధతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామపంచాయతీ సౌజన్యంతో అలాంటి విద్యార్థుల కోసం ఒక టీవీని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించడం ద్వారా ఆయా విద్యార్థులకు వీడియో పాఠాలను అందించవచ్చని భావిస్తోంది. ఇక పాఠశాలల్లో టీచర్లను ఎంతమందిని అందుబాటులో ఉంచాలి?, లేదా అందరినీ స్కూళ్లకు పంపించాలా? అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థుల కోసం మాత్రం రొటేషన్ పద్ధతిలో కొంతమంది టీచర్లను మాత్రం కచ్చితంగా పాఠశాలల్లో ఉంచాలని పేర్కొంది. -
విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా బోధన ప్రారంభానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. హైకోర్టుకు తమ విధానపర నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉన్నం దున కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇటీవల ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శ కాల ప్రకారమే ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. అయితే అందులో ఆన్లైన్ బోధనతో పాటు రికార్డెడ్ వీడియో పాఠాల విధానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండింటి పైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోం ది. వీలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని, వీలుకాని గ్రామీణ ప్రాంతాల్లో వీడియో పాఠాలను టీశాట్, దూర దర్శన్ (యాదగిరి), ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ చానల్ వంటి వాటి ద్వారా బోధనను చేపట్టే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఆన్లైన్ బోధన చేపట్టాలంటే విద్యార్థులకు మొబైల్/ట్యాబ్ వంటివి అవసరం. అయితే విద్యార్థుల ఇళలో ఏ మేరకు ఆయా పరికరాలున్నాయో అనధికారిక సర్వే చేయాలని కేంద్రం ప్రజ్ఞతలో పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని భావి స్తోంది. కరోనా కొంత అదుపు లోకి వచ్చే వరకు ఆన్లైన్, వీడియో పాఠాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం షిఫ్ట్ పద్ధతుల్లో బోధన చేపట్టే అంశాలను పరిశీలిస్తోంది. అందులోనూ ముం దుగా 9, 10 తరగతులకు బోధన నిర్వహించడం, కొన్ని రోజుల తర్వాత 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఇక రెండు, మూడు నెలల తరువాతే ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధనను చేపట్టే అంశంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ స్కూళ్లలో 90% వీడియో పాఠాలే.. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠ శాలలుంటే అందులో 28 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. గురుకులాలు, ఇతర ప్రత్యేక విద్యా సంస్థలను మినహాయిస్తే 23 లక్షల మందికి పైగా విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీటిల్లో 90% మంది విద్యార్థులకు వీడియో పాఠాలే బోధించే అంశంపై పరిశీలన జరుపు తున్నట్లు తెలిసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పాఠాలు బోధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు దేనిపైనా ఓ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. వివిధ కోణాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రైవేటులోనూ ఎక్కువ శాతం వీడియో పాఠాలవైపే.. రాష్ట్రంలోని 10 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 2 వేలకు పైగా ఉన్న కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ప్రముఖ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ పాఠాలను ప్రారంభించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాల్లోని మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు ఇంకా ఆన్లైన్ బోధన చేపట్టలేదు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా ఆచరణ ఎంత మేరకు సాధ్యమవుతుందన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు కూడా కొన్నాళ్ల వరకు వీడియో పాఠాల వైపే మొగ్గు చూపే అవకాశముంది. ఆన్లైన్ కష్టసాధ్యం.. అమలు చేసినా కొద్దిసేపే.. రాష్ట్రంలో వీలున్న స్కూళ్లలో ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలే ఆన్లైన్ బోధన చేపట్టే అవకాశముంది. ఉన్నత పాఠశాల్లో గరిష్టంగా 4 సెషన్లలోనే, 1 నుంచి 8 తరగతులకు రెండు సెషన్లలోనే బోధనను నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతకుమించి ఎక్కువ బోధన చేపట్టే వీలుండదని, పైగా ఆన్లైన్ బోధనకు టీచర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటన్నింటికంటే వీడియో పాఠాలే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. -
రేపటి నుంచి లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్ దిశ’ పేరుతో ఆన్లైన్ క్లాసులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్‌లుగా విభజించి డిజిటల్ తరగతులు, ఆన్లైన్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అదే విధంగా కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే విద్యా సంస్థలు తెరిచే అవకాశం కనబడటం లేదు. దీంతో డిజిటల్ తరగతులకు ప్రాధాన్యం పెరగడంతో ఆ దిశగా లెక్చరర్లను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడనుంది.(ఆన్లైన్ పాఠాలు; ఆసక్తికర అంశాలు)