అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం అధికారికంగా ప్రారంభం కావాల్సిన డిజిటల్ తరగతులు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 20న ప్రారంభమవుతాయని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ఇప్పటికి 18 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వాయిదా పడటంతో అరకొర సదుపాయాలున్న 80 మోడల్ ప్రైమరీ పాఠశాలల్లోనూ వసతులు కల్పించి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డిజిటల్ తరగతుల ప్రారంభం వాయిదా
Published Fri, Oct 14 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement
Advertisement