
తిరువనంతపురం: దేశంలోనే అక్షరాస్యతలో ముందుండే కేరళ మరో అడుగు ముందుకేసి డిజిటల్ తరగతుల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. హైటెక్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా అధునాతన గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్స్, మల్టీమీడియా ప్రొజెక్టర్ల వంటి సదుపాయాలతో 40వేల తరగతులను డిజిటల్ తరగతులుగా మార్చేస్తోంది. ఇందుకోసం కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్(కైట్) 40,083 తరగతులను ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలతోపాటు ఎయిడెడ్ స్కూళ్లను కూడా ఇందుకు ఎంపిక చేశారు.
అయితే పాఠశాలల్లో ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ విద్యను మరింత ప్రోత్సహించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు కైట్ వైస్‌చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్వర్ సాదత్ తెలిపారు. మలప్పురం జిల్లాలో అత్యధికంగా 5,096 తరగతులను ఎంపిక చేయగా, కోజికోడ్‌లో4,105, త్రిశూర్ 3,497 తరగతులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ల్యాప్‌టాప్‌లు, మల్టీమీడియా ప్రొజెక్టర్లు, మౌంటింగ్ కిట్లు, యూఎస్‌బీ స్పీకర్లను ఆయా పాఠశాలలకు పంపినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment