మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి | Should Improve pass percentage | Sakshi
Sakshi News home page

మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి

Published Thu, Nov 24 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

మెరుగైన ఉత్తీర్ణత  సాధించాలి

మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మె రుగైన ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు.

కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్
డిజిటల్ తరగతుల తనిఖీ

తలమడుగు : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మె రుగైన ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. బుధవారం ఆయన మం డల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల, లింగి గ్రామంలోని కేజీబీవీని జిల్లా విద్యాధికారి లింగయ్యతో కలిసి తనిఖీ చేశారు. తరగతి గదుల్లో కూర్చుని ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. డిజిటల్ తరగతులను పరిశీ లించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మా ట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల ఫలి తాల కంటే ఈసారి అధిక ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణత సాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కౌసల్య, తహసీల్దార్ చిత్రు పటేల్, ఎంపీడీవో సునీత, ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్, కేజీబీవీ ప్రిన్సిపాల్ అల్‌మూన్ పాల్గొన్నారు.

 తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయూ న్ని కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. మండల జనాభా, వ్యవసాయంపై తహసీల్దార్ చిత్రు పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయూనికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లే కుండా చూడాలని, రైతుల భూ సమస్యలు వెం టనే పరిష్కరించాలని ఆదేశించారు. దళితబస్తీ లో పంపిణీ చేసిన భూములకు రుణాలు ఇప్పిం చాలని తలమడుగు గ్రామ మహిళలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారంలోగా సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనిచ్చా రు. ఎంపీడీవో సునీత, ఆర్‌ఐ లచ్చిరామ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement