డిజిటల్ విద్యా విధానానికి నాంది
Published Fri, Oct 14 2016 6:39 PM | Last Updated on Fri, Sep 28 2018 3:58 PM
–జిల్లాలో 90పాఠశాలల్లో త్వరలో ప్రారంభం.
–డీ.ఈ.ఓ మధుసూధనరావు.
నల్లజర్ల:
మారుతున్న విధ్యావిధానానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యారంగంలో సాంకేతికతను జోడించి విద్యార్ధులను ఆకట్టుకునే రీతిలో నూతన బోధనా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు వెల్లడించారు.శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 90 పాఠశాలల్లో ఈవిధానం అమల్లోకి తీసుకువచ్చామని ఈనెల 15 నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు ఆయన వివరించారు.ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈసిస్టమ్ అమర్చడం జరిగిందన్నారు.నూతన విద్యా విధానంలో 6నుండి 10తరగతుల వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి 500 జీబీ సామర్ధ్యంతో లోడ్ చేసినట్టు చెప్పారు. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్ధులకు అవగాహన,ఏకాగ్రత,జ్ణాపక శక్తి పెరుగుతుందన్నారు.జిల్లాలోని మిగిలిన పాఠశాలల్లో ఈవిద్యా విధానం ప్రవేశపెట్టడానికి సన్నాహలు జరుగుతున్నాయన్నారు.
–కొత్త విధానానికి ఆహ్వనం.
స్మార్ట్ తగరతి గదుల ఏర్పాటు వల్ల కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నూతన సాంకేతిక పరిజ్ణా అందించి ఆధునిక బోధనా పద్ధతుల్లో విద్యార్ధులకు పాఠాలు బోధించే అవకాశం కల్గుతుంది.డిజిటల్ విధానానికి స్వాగతం పలుకుతున్నాం.ప్రాధమిక స్ధాయి నుంచే ఈవిధానం ప్రవేశపెడితే విద్యా ప్రమాణాలు పెరుగడుతాయి.పోటీ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ధీటుగా ఎదుర్కొని విజయాలు సాధిస్తారు.
నెక్కలపూడి ప్రతాప్.పాధ్యాయుడు.నల్లజర్ల జడ్పీహైస్కూలు.
Advertisement
Advertisement